RRR: ఇండియన్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అప్పట్లో చరణ్ హీరోగా వచ్చిన “మగధీర” ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. “మగధీర” అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాకా యావత్ భారత సినీ ప్రేమికులను ఎంతగానో ఆకర్షించడం జరిగింది. ఒక ప్రాంతీయ తెలుగు భాషా చిత్రంలో హాలీవుడ్ స్థాయి టేకింగ్.. ఎమోషనల్ సన్నివేశాలు పండిస్తూ రాజమౌళి పనితనం చూసి అప్పట్లోనే అనేక మంది మెచ్చుకోవటం జరిగింది. ఇక “బాహుబలి”తో పూర్తి స్థాయిలో తన సత్తా ఏంటో దేశ అంతర్జాతీయ సినీ ప్రేమికులకు తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం “బాహుబలి” తర్వాత రాజమౌళి “RRR” సినిమా చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన మేకింగ్ వీడియో.. రిలీజైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులు సృష్టించడం జరిగింది. మరోపక్క రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. అక్టోబర్ 13వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాలో మగధీర తరహా ప్రమోషన్ సాంగ్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు సమాచారం.
Read More: RRR: ఊపిరిబిగపట్టే అప్డేట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ ఆరోజున..
అప్పట్లో మగధీర సినిమా లో చివరిలో సినిమా కోసం పనిచేసిన అన్ని డిపార్ట్మెంట్ సభ్యులను చివరి పాటలో రాజమౌళి చూపించడం జరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో RRR లో.. సాంగ్ మొత్తం చరణ్ ఎన్టీఆర్ ల చేత.. సినిమా కోసం పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ సభ్యులనీ చూపించడానికి రాజముండ్రి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. అక్టోబర్ 13వ తారీకు సినిమా రిలీజ్ అవుతుండటంతో…. ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!