Samantha: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ అంటే సమంత పేరే చెబుతారు. అంతలా పుష్ప ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వరుస సినిమాలతో బిజీగా వున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. వీడియోస్.. మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్లో ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా “నేను వందసార్లు ఓడిపోయాను.. కానీ లేచి నిల్చున్నాను” అంటూ ఓ కొటేషన్ షేర్ చేసింది.
Guppedentha Manasu Highlights: గుప్పెండత మనసు సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం..!!
Samantha: అసలు ఏమి జరిగిందో తెలుసా?
ఆమె షేరే చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏమి జరిగిందో తెలుసా? ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్లో టూర్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ స్కీయింగ్ చేస్తున్న వీడియోస్ తరచూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది. స్కీయింగ్ కోసం ఆమె దాదాపు ఓ 10 రోజుల పాటు కష్టపడాల్సి వచ్చిందట. రోజుకు దాదాపు 5 నుంచి 6 గంటలపాటు ప్రాక్టీస్ చేసినట్లు చెబుతోంది. ఈ క్రమంలో స్కీయింగ్ కోసం తాను పడిన పాట్లను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
Guppedentha Manasu Highlights: గుప్పెండత మనసు సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం..!!
ఫుల్ కొటేషన్ ఇదే మరి.!
“నేను బన్నీ వాల్ పై స్కీయింగ్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను. వందసార్లు కింద పడిపోయాను. పడిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో లేచాను.. వదిలేయాలనే ఆలోచన చాలాసార్లు నా మనస్సులోకి వచ్చింది. కానీ సంతోషంగా ముందుకు సాగాను. బన్నీ స్లోప్ ల నుంచి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం.. దాని కోసం నేను చేసిన కృషిలో నిజమైనదానిని కనుగొన్నాను. ఊహించని విధంగా ఇది ఉత్సాహంగా ఉంది” అంటూ సామ్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని వెర్బియర్ స్కీరిస్టార్ట్లో స్కీయింగ్ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షకురాలు కేట్ మెక్బ్రైడ్కు ధన్యవాదాలు తెలిపింది.