Samantha : టాలీవుడ్ హిట్ పైర్స్ లో సమంత, నాగ చైతన్య జంట కూడా ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదనే చెప్పాలి. కొన్నాళ్ళ పాటు ప్రేమించుకుని మరి వీరిద్దరూ ఎంతో ఆర్బాటంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే వీళ్ళ పెళ్లి మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోయిందనే చెప్పాలి. వీరి వైవాహిక జీవితంలో వచ్చిన కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న ఈ జంట విడాకులు తీసుకున్నారు.
Samantha : వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారుగా..?
వీరి విడాకుల విషయం తెలిసి నాగ్, సామ్ అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. ఇప్పటికీ వాళ్ళ విడాకుల విషయాన్నీ కొంతమంది జిర్ణించుకోలేకపోతున్నారు.అయితే వీరి విడాకుల విషయంలో రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసాయి.ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని బాధించింది.ఇప్పటి వరకు వారు అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారో అనే విషయంపై సరైన క్లారిటీ అనేది ఇవ్వలేదు..ఇదిలా ఉండగా నాగ చైతన్య గాని, సమంత గాని ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకున్నది లేదు. విడిపోయినప్పటికి మేము మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము అని మాత్రం చెప్పుకొచ్చారు.
Samantha : వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఇవే :
వీరిద్దరూ కలిసి మొట్ట మొదటిసారిగా “ఏ మాయ చేసావే” అనే సినిమాలో నటించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది.ఎంతోమంది ప్రేక్షకులు వీరికి అభిమానులు అయిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఆటో నగర్ సూర్య,మనం,మజిలీ వంటి సినిమాల్లో నటించారు.మజిలీ సినిమాలో చైతూ, సమంత ఎంతో రొమాంటిక్‌గా కనిపించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
చైతూ ఫోటోను పోస్ట్ చేసిన సామ్
ఈ క్రమంలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రం మూడేళ్లు పూర్తైన సందర్భంగా సమంత ఒక పోస్టర్ ను పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ ఎవరిదో తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే విడాకులు అయ్యి ఇన్నాళ్లు అయ్యాక మొట్టమొదటి సారిగా సామ్ తన అకౌంట్ లో చైతూ సీరియస్ లుక్ ఉన్న పోస్టర్‌తో పాటుగా, రొమాంటిక్ గా ఉన్న మరొక పోస్టర్ ను కూడా షేర్ చేసింది. అలాగే కింద 3 ఏళ్ల మజిలీ అంటూ క్యాప్షన్ రాసుకోచ్చింది. ఇన్నాళ్ల తర్వాత సమంత పోస్ట్‌లో చైతూ పిక్ చూసి ఇది కలయా లేక నిజామా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!