NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ .. ఎలక్ట్రోరల్ బాండ్స్ పై సుప్రీం సంచలన తీర్పు

Big Breaking: రాజకీయ పార్టీలకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్‌. రాజకీయ పార్టీలు అధికారికంగా విరాళాల సేకరణకు ఉద్దేశించిన ఎలక్ట్రోరల్ బాండ్ల స్కీమ్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్ట్రోరల్ బాండ్ల స్కీమ్ చట్టవిరుద్దమని తేల్చి చెప్పింది.

Supreme Court

ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్దమని, ఈ స్కీమ్ ను తక్షణమే నిలిపివేయాలని సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకో కు దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది.

నల్లధనం అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. సంస్థల నుండి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయని పేర్కొంది.

కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను వెబ్ సైట్ లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్ (ఎన్ జి వో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) , కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది.

కాగా, ఎలక్ట్రోరల్ బాండ్ల స్కీమ్ ను 2019 జనవరి 2న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పారదర్శకత పద్దతిలో నిధులు సేకరిస్తున్నాయి. పథకానికి సంబంధించిన రూల్స్ ప్రకారం.. ఏ భారతీయ పౌరుడు లేదా స్థాపించబడిన సంస్థ ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వ్యక్తిగతంగా లేదా కొంత మంది వ్యక్తులు సమూహం కలిసి ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 లోని సెక్షన్ 29 ఏ  కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా విరా ళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది. అర్హత కల్గిన రాజకీయ పార్టీలు అధీకృత బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే విరాళాలను పొందాల్సి ఉంటుంది. అయితే. రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక చట్టం – 2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ స్కీమ్ ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.

Election commission: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు ఉపయోగించుకోవచ్చు .. కానీ  

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?