NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: బీఆర్ఎస్ ను వీడేందుకు మైనంపల్లి సిద్దమైనట్లే(గా)..?

Advertisements
Share

BRS: బీఆర్ఎస్ పార్టీలో టికెట్ లు రాని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దం అవుతుండగా, మల్కాజ్ గిరి టికెట్ ఖరారు అయినప్పటికీ తన కుమారుడు రోహిత్ కు టికెట్ ఇవ్వకపోవడంపై సీనియర్  ఎమ్మెల్యే మైనంపల్లి పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే తాను బీఆర్ఎస్ నుండి పోటీ చేసేది లేదని స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉంటానని పేర్కొన్నారు మైనంపల్లి.

Advertisements

ప్రస్తుతం తిరుమలలో ఉన్న మైనంపల్లి .. బీఆర్ఎస్ అభ్యర్ధుల ఖరారు అయిన తర్వాత సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను హైదరాబాద్ వెళ్లిన తర్వాత తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేశారు మైనంపల్లి. అయితే మరో పక్క సొంత పార్టీ నేతలే మైనంపల్లి పై ఫైర్ అవుతున్నారు. హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన మైనంపల్లి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే మైనంపల్లి వ్యాఖ్యలను కేటీఆర్, కవిత ఖండించారు. ఈ క్రమంలోనే ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisements

నిన్న మంత్రి మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని పేర్కొన్నారు. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడని.. అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు తన నియోజక వర్గాన్ని వదిలేసి తమ జిల్లాలో ఎందుకు పెత్తనం చేస్తున్నారంటూ మండిపడ్డారు మైనంపల్లి. దీంతో ఆయనపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైనంపల్లి పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్దం అవుతున్నట్లుగా వ్యాఖ్యలు ఉండగా, ఆయనపై వేటుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తొంది.

BRS: అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో అగ్రకులాలకే అగ్రతాంబూలం .. కులాల వారీగా కేసిఆర్ లెక్క ఇది


Share
Advertisements

Related posts

Manjula Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ, మంజుల ప్రేమకు నో చెప్పారట! చివరికి ఎవరు ఒపించారో తెలుసా??

Naina

Love proposal: ఒక మహిళా జడ్జ్ కి దొంగ ఎలా తన ప్రేమని తెలిపాడో తెలుసా? దానికి ఆమె స్పందన అదిరిపోయింది !!

Naina

WhatsApp  : వాట్సాప్ యూజర్లకు షాక్.. మరో నిబంధన విధించింది..

bharani jella