డిజిటల్ మీడియా రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న రామ్ వీరపనేని తో సింగర్ సునీత నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. సింగర్ సునీత తన సొంత గ్రహంలో తన ఇద్దరు పిల్లల సమక్షంలో చాలా సింపుల్ గా ఈ నిశ్చితార్థ వేడుక జరుపుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో సింగర్ సునీత రెండో పెళ్లి తేదీ డిసెంబర్ 27వ తారీకు అంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఆ తేదీ నాడు ఇద్దరి జాతకాల ప్రకారం ముహూర్తం కుదరలేదని పెళ్లి వాయిదా పడినట్టు సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతుంది. మరోపక్క చూస్తే వచ్చే జనవరి నుండి మే నెల వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఇద్దరు జాతకం ప్రకారం జనవరి 9వ తారీఖున బలమైన ముహూర్తం కుదిరినట్లు దీంతో ఆ రోజు సింగర్ సునీత రెండో పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
కరోనా నేపథ్యంలో నిశ్చితార్థం తరహాలోనే రెండో పెళ్లి కూడా కేవలం సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్ గా కానీచేయాలని సునీత అనుకుంటున్నట్లు సరికొత్త టాక్ వస్తోంది. ఈ ముహూర్తం దాటితే వచ్చే ఏడాది మే మాసం దాటే వరకు ముహూర్తాలు లేకపోవడంతో.. జనవరిలోనే సింగర్ సునీత రెండో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. మొదటి పెళ్లి సునీతకి 19 ఏళ్ల వయసులో జరగగా.. మొదటి భర్తతో మనస్పర్థలు వచ్చి సునీత విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే తన పిల్లలను చూసుకుంటూ మరోపక్క కెరియర్ కొనసాగిస్తూ రాణిస్తున్న సునీత తాజాగా రెండో పెళ్ళికి రెడీ అవటంతో.. ఇండస్ట్రీలో ఈ వార్త వైరల్ గా మారింది.