Balakrishna : బాలకృష్ణ Balakrishna – బోయపాటి శ్రీను ల బీబీ 3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ – బోయపాటి శీనుల సినిమా నుంచి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సాలీడ్ అప్డేట్ తాజాగా వచ్చిన సంగతి తెలిసందే. ఈ సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించారు మేకర్స్. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. 2020 లో మిస్ అయిన సినిమాలన్ని 2021 లో ప్రేక్షకుల ముందుకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది దాదాపు 20 సినిమాలకి పైగానే రిలీజ్ అవనున్నాయి.
కాగా నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. బాలయ్య తో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా తీసి భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. సింహా తో పాటు ‘లెజెండ్’ కూడా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చి భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రెడీ అవుతోంది. ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని మే 28 న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.
Balakrishna : సోనూసూద్ ని తీసుకోవాలనుకుంటున్న బాలయ్య – బోయపాటి ..?
“మోనార్క్” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేస్తారని అంటున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమాలో నటించే మేయిన్ విలన్ విషయంలో పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. అంతేకాదు ఇప్పటికే పలువు పేర్లని అనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో సోనూసూద్ ని తీసుకోవాలని బాలయ్య – బోయపాటి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకొని సోనూసూద్ ప్రేక్షకుల్లో అభిమానాన్ని విపరీతంగా పొందారు. ఆయనకున్న క్రేజ్ ఇప్పుడు అసాధారణం. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీబీ3 లో భాగమైతే సినిమాకి బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారట.