Interest Rates: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి తెలియని వారే వుండరు. ఎందుకంటే ఇది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపకరిస్తుంది. దాదాపు చాలా మంది తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళకోసం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం కింద డబ్బులు దాస్తూ వుంటారు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందొచ్చు. మంచి రాబడి, పన్ను మినహాయింపు వంటి లాభాలు ఇందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాదిలో ఈ విషయమై ఓ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లలో మార్పు తీసుకురానుందా?
అవును.. త్వరలో సుకన్య సమృద్ధి స్కీమ్ వడ్డీ రేట్లపై కేంద్ర ప్రభుత్వం ఓ అప్డేట్ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వం మాములుగా ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేటును సమీక్షిస్తూ ఉంటుందన్న విషయం మనలో చెలామందికి తెలుసు. అందువల్ల ఈ జనవరి 1న కేంద్రం వడ్డీ రేట్లను డిసైడ్ చేయనుంది. అంటే ఇక్కడ వడ్డీ రేట్లను పెంచొచ్చు, లేదంటే తగ్గించొచ్చు. లేదంటే స్థిరంగా కొనసాగించొచ్చు. కేవలం సుకన్య సమృద్ధి స్కీమ్‌కి మాత్రమే కాకుండా ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కూడా ఇదే వర్తిస్తుంది.
ఈ వడ్డీ రేట్లలో మార్పు ఇలా ఉంటుంది!
ప్రస్తుతం వడ్డీ రేట్లను మనం చూసినట్లయితే.. సుకన్య సమృద్ధి స్కీమ్‌పై సుమారుగా 7.6 శాతం వరకు వడ్డీ వస్తోంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 6.8 శాతం వరకు వస్తోంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. రైతులకు సంబంధించి కిసాన్ వికాస్ పత్ర పథకంపై 6.9 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ వస్తోంది. అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌పై 6.6 శాతం వడ్డీ, టైమ్ డిపాజిట్‌పై 6.7 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తుంది.