NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala: వైభవంగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది.

ఉత్సవాల్లో తొలి రోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి వారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, సిఇ నాగేశ్వరరావు, ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి, విజిఓలు నంద కిషోర్, గిరిధర్ రావు, శ్రీ బాల్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఉత్సవాల్లో రెండో రోజు 21 (రేపు)న రుక్మిణీ సమేతంగా కృష్ణస్వామి మూడు సార్లు తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు మార్చి 22న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయయ్ప స్వామి పుష్కరిణిలో మూడు సార్లు చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదే విధంగా మార్చి 23న నాలుగో రోజు అయిదు సార్లు, మార్చి 24న చివరి రోజు ఏడు సార్లు మలయ్య స్వామి భక్తులకు దర్శనివ్వనున్నారు.

కాగా, తెప్పోత్సవాల కారణంగా 20, 21వ తేదీల్లో మహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 22, 23,24 తేదీల్లో అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

Lok Satta Party: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు అంటూ సంచలన ప్రకటన చేసిన లోక్ సత్తా జేపీ

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju