NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

టీడీపీ-జ‌నసేన పార్టీలు ఉమ్మ‌డి జాబితా ప్ర‌క‌టించి.. ప‌ట్టుమ‌ని వారం కూడా కాకుండానే.. భారీ స‌భ నిర్వ హించారు. తాడేప‌ల్లిగూడెం శివారులో నిర్వ‌హించిన ఈ స‌భ‌కు భారీ ఎత్తున జ‌నాలు త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. ఒక‌వైపు.. ఈ పొత్తు ఇంకా కుదురుకోలేద‌ని.. ఇరు పార్టీల మ‌ధ్య క్షేత్ర‌స్తాయిలో క‌లివి క‌నిపించ డం లేద‌ని.. ముందుగా ఆ దిశ‌గా అడుగులు వేయ‌కుండా..ఇలా స‌భ‌లు పెట్టి గ‌గ్గోలు పెడితే ప్ర‌యోజ‌నం ఏంట‌నే చ‌ర్చ తెర‌మీద‌కి వ‌చ్చింది.

వైసీపీ అనుకూల మీడియాలు, స‌హా ప‌లువురు మంత్రులు కూడా ఇలానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. `గ్రౌండ్ లెవిల్లో .. పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు స‌భ‌లు ఎందుకు? ఇదొక స్టంటు` అని వైసీపీ ముఖ్య నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇలాంటి వాద‌న‌లు, వ్యాఖ్య‌లు చాలా మంది నుంచి వినిపిస్తున్నా యి. అయితే.. ఇలా జాబితా రూపొందించిన వెంట‌నే మ‌హా స‌భ‌నిర్వహించ‌డం ద్వారా.. చాలా వ్యూహాత్మ కంగా మిత్ర‌ప‌క్షాలు ముందుకు క‌దులుతున్నాయ‌ని ఈ పార్టీల నేత‌లు చెబుతున్నారు.

`నిజ‌మే. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య క‌లివిడి స‌మ‌స్య‌గా ఉంది. అయితే.. దీని కోసం ఒక‌వైపు ప్ర‌య త్నాలు చేస్తూనే మ‌రోవైపు, స‌భ‌లు నిర్వ‌హించ‌డం ద్వారా అంత‌ర్గ‌తంగా పార్టీల మ‌ధ్య ఉన్న ఇబ్బందుల ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. ఈ నేప‌థ్యంలోనే స‌భ‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం.` అని జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, పొత్తుల విష‌యంపై క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, కార్య‌కర్త ల మ‌ధ్య స‌యోధ్యను కుద‌ర్చ‌డం కూడా.. స‌భ‌ల ఉద్దేశంగా మారింది.

ఇక‌, ప్ర‌జ‌ల్లోనూ .. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల ప‌రంగా చూసుకుంటే,కాపు వ‌ర్గంలో పొత్తుల వ్య‌వ‌హారానికి సంబంధించి వేడి త‌గ్గ‌కుండా చూడాల‌నే ఉద్దేశం ప్ర‌ధానంగా ఉంది. అందుకే.. ఉన్న‌ప‌ళంగా పొత్తులు ఇంకా పూర్తిగా కొలిక్కి రాకుండానే భారీ స‌భ‌ను నిర్వ‌హించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇలాంటివి మున్ముందు మరిన్ని నిర్వ‌హించాల‌నేది పార్టీల ప్లాన్‌గా ఉంద‌ని అంటున్నారు. ప్ర‌జ‌లు, మిత్ర‌ప‌క్షాల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వేడి త‌గ్గ‌కుండా చూసేందుకే ఈ స‌భ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని అంటున్నారు.

Related posts

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?