NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Tourist Places In July: ఈ నెలలో చూడదగిన ప్రదేశాలు ఏమిటో తెలుసా..అవి ఏమిటంటే..

Tourist Places In July: ఎక్కువ మంది వేసవి సెలవులలో పర్యాటక ప్రదేశాల సందర్శనకు ప్రణాలికలు సిద్దం చేసుకుంటుంటారు. అయితే గత ఏడాది, ఈ ఏడాది కరోనా ఉధృతి కారణంగా విహార యాత్రలు కుదరలేదు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు ఏదైనా టూర్ ప్లాన్ చేసుకునే వారు వ్యాక్సిన్ తీసుకుని తగిన జాగ్రత్తలతో విహార యాత్రలు చేసుకోవచ్చు. ప్రస్తుత వర్షాకాలంలో జులై నెలలో చూడదగిన ప్రదేశాలు ఇవి.

Tourist Places In July:
Tourist Places In July

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్

మన దేశం నుండి యునెస్కో గుర్తించిన టూరిస్ట్ ఆఫ్ హిస్టారికల్ ప్లేస్ “వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్” ఉత్తరాఖండ్ లోని చమోలి – పితోర్ గఢ్ మధ్యలో ఉంటుంది. ఈ ప్రదేశానికి వెళ్లేందుకు జూలై నెల మంచిది. సముద్రమట్టానికి 3,858 మీటర్ల ఎత్తులో అందమైన పర్వతాలు, పూల తోటలతో ఆహ్లాదాన్ని పంచుతుంది. వ్యాలీ ఆఫ్ ప్లవర్స్ హేమకుంట సాహిబ్, బీమ్ పూల్, సరస్వతి నది వంటివి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు.

ట్రెక్కింగ్ కు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశం. పర్వతాలపై పచ్చగా ఎదిగిన పూలమొక్కల మధ్య ట్రెక్కింగ్ చేయడం మధురానుభూతిని అందిస్తుంది. ఈ నెలలో విరబూసే రంగురంగుల పూలను చూస్తూ సేదతీరవచ్చు. డెహ్రాడూన్, హరిద్వార్ నుంచి విమానంలో కానీ రైలులో గానీ చేరుకోవచ్చు. హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.

స్పితి వ్యాలీ

అందమైన రాతి పర్వతాలు, వాటి మధ్యలో నుండి పారే మంచు నదులు..స్పితి వ్యాలీ ప్రత్యేకత. పర్వత ప్రాంతాలను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది కాబట్టి దీన్ని మక్కా ఆఫ్ మౌంటైన్ లవర్స్ అని కూడా పిలుస్తారు. బుద్దిజానికి సంబంధించిన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సంస్కృతికి ప్రతిబంబించే చిన్న ఆలయాలు, గ్రామాలు ఉన్నాయి. రాతి పర్వతాన్ని చీలుస్తూ వేసిన రోడ్లపై ప్రయాణం సాహసయాత్రను తలపిస్తుంది. కీ మానస్టరీ, టాబో మానస్టరీ, బారా షిగ్రీ గ్లేసియర్ వంటివి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. జీప్ సఫారి. ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రదేశం. ఈ నెలలో పర్యాటకులు వెళ్లగలిగే మంచి ప్రదేశం ఇది. కుల్లూ విమానాశ్రయం నుండి విమాన సదుపాయం ఉంది. సిమ్లా రైల్వే స్టేషన్ నుండి కూడా ప్రయాణించవచ్చు.

షిల్లాంగ్

ఈ నెలలో పర్యటించిన దగిన మంచి ప్రదేశాలలో షిల్లాంగ్ ఒకటి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈశాన్య భారతదేశంలోని అందమైన ప్రదేశాల్లో ఒకటి. చుట్టూ చిన్న చిన్న పర్వతాలు. సరస్సులతో పర్యావరణ  ప్రేమికులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది షిల్లాంగ్. ఇది హిల్ స్టేషన్. పచ్చని పకృతితో ఆకట్టుకునే ప్రదేశాల్లో వాకింగ్ చేస్తూ సేద తీరవచ్చు. గౌహతి స్టేషన్ తో పాటు చెన్నై, ఆహ్వదాబాద్, ఢిల్లీ నుండి విమానాల ద్వారా వెళ్లవచ్చు.

గుల్ మార్గ్

జూలై నెలలో మంచు ప్రదేశాన్ని చూడాలనుకుంటే కశ్మీర్ లోని గుల్ మార్గ్ వెళ్లాల్సిందే. కొంచెం ఎండ, తక్కువ ఉష్ణోగ్రతతో మంచు వాతావరణాన్ని ఆహ్లాదించవచ్చు. మంచు కరిగి పారుతున్న నదిని దగ్గరగా చూస్తూ పర్వతాల నుండి చల్లగా వీచే గాలి స్పర్శను అనుభూతి చెందుతూ గుల్ మార్గ్ సందర్శనను మధురానుభూతిగా ఉంచుకోవచ్చు. ఖిలాన్ మార్గ్, అల్పతార్ లేక్ వంటి మరెన్నో ప్రదేశాలను కూడా చూడవచ్చు. శ్రీనగర్ విమానాశ్రయం నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.

 

author avatar
bharani jella

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!