టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

 

గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జి హెచ్ఎంసి) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఘోర ఓటమి కి నైతిక బాధ్యత వహిస్తూ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్ కు పంపారు.

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నానని, తన స్థానంలో కొత్త అధ్యక్షుడు ని నియమించే ప్రక్రియ ప్రారంభించాలని పార్టీ అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ రాజీనామాతో మల్కాాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు త్వరలో అప్పగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

కాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రధానంగా అధికార టీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీల మధ్యనే పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో బిజెపి వ్యూహాత్మక అడుగులు వేసి పార్టీ అధినాయకత్వాన్ని సైతం ప్రచారంలోకి దింపటంతో అనూహ్య ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.