NewsOrbit
న్యూస్

ఆసుపత్రి నుండి వైట్ హౌస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

 

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..వాల్టన్ రీడ్ సైనిక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడ్డ ట్రంప్ శుక్రవారం నుండి సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ట్రంప్ కరోనా నుండి కోలుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ట్రంప్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి మెరైన్ వన్ హెలికాఫ్టర్ లో వైట్ హౌస్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను, తన సందేశాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు ట్రంప్.

మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం సంతోషంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. కోవిడ్ గురించి ఎవరూ భయపడొద్దని ఆయన సూచించారు. మన జీవితాలపై వైరస్ అధిపత్యం ప్రదర్శించకుండా చూసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు అవసరమైన మందులు ఆందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ట్రంప్. త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా మరో వారం రోజుల పాటు వైట్ హౌస్‌లోనే వైద్యులు ట్రంప్‌కు చికిత్స అందించనున్నారు. గత 72 గంటల్లో ట్రంప్ కు జ్వరం రాలేదనీ వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే తెలిపారు. సోమవారం మరో సారి రెమిడెసివిర్ అందించామని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందనీ, ప్రమాదం నుండి పూర్తిగా బయటపడ్డారని చెప్పలేమన్నారు. అత్యుత్తమ వైద్య నిపుణులు పర్యవేక్షణలో హైట్ హౌస్‌లోనే చికిత్స కొనసాగుతుందని ఆయన తెలిపారు.

కాగా ట్రంప్ తో పాటు ప్రధమ మహిళ మోలానియా ట్రంప్, ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్ బిల్ స్టెపీన్, ఆయన పర్సనల్ అసిస్టెంట్ నిక్ లూనా, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలిగ్ మెక్‌నానీ కూడా కరోనా బారిన పడ్డారు.

https://twitter.com/realDonaldTrump/status/1313267143232942081

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?