మీకు ట్రంప్ కు ఓ తమ్ముడు ఉన్నారని తెలుసా? ట్రంప్ తమ్ముడి పేరు రాబర్ట్. ఆయన రియల్ ఎస్టేట్ డెవలపర్. అచ్చు గుద్దినట్టు డొనాల్డ్ ట్రంప్ లాగానే ఉండే రాబర్ట్ ను చూడటానికి ట్రంప్ న్యూయార్క్ కు వెళ్లారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాబర్డ్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న ట్రంప్ హడావుడిగా తన పనులన్నీ మానుకొని వెళ్లారు.
రాబర్ట్ న్యూయార్క్ సిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ట్రంప్ వెళ్లి పరామర్శించారు. ఆయనకు ఏమైంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేనప్పటికీ.. న్యూజెర్సీ కంట్రీ క్లబ్ కు వెళ్లాల్సిన డొనాల్డ్ ట్రంప్ వెంటనే న్యూయార్క్ కు వెళ్లి తన తమ్ముడిని కలిశారు.
నాకు మంచి తమ్ముడు ఉన్నాడు. మా మధ్య చాలా మంది బంధం ఉంది. అతడి పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. కానీ.. త్వరలోనే కోలుకుంటాడు.. అని తన తమ్ముడిని కలవడానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ చెప్పారు.
అయితే.. ఏబీసీ కథనం ప్రకారం రాబర్ట్ ట్రంప్ కు ఆరోగ్యం బాగాలేక న్యూయార్క్ లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో జూన్ లో చేరారని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. ఆ తర్వాత శనివారం రాత్రే రాబర్ట్ అనారోగ్యంతో కన్నుమూసినట్టు ట్రంప్ ప్రకటించారు.
జూన్ లో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన ఫ్యామిలీ మరో కోణాన్ని ఆవిష్కరించేలా తన కోడలు మేరీ ట్రంప్ రాసిన పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా రాబర్ట్ ట్రంప్ ఆపగలిగారు. కోర్టుకు వెళ్లి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయకూడదంటూ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ.. తాత్కాలికంగా మాత్రమే కోర్టు ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయకుండా రాబర్ట్ ట్రంప్ కు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది.