Vijay : విజయ్ కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. గత మూడు నాలుగేళ్ళుగా వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ కోలీవుడ్ లో టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. ఇదే క్రమంలో టాలీవుడ్ లో కూడా విజయ్ అభిమానులను సంపాదిచుకున్నాడు. విజయ్ తమిళంలో నటించిన సినిమాలన్ని ఇక్కడ కూడా డబ్బింగ్ అవుతూ మంచి వసూళ్ళు సాధిస్తున్నాయి. ఇక్కడ కూడా విజయ్ సినిమాలకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక రీసెంట్ గా మాస్టర్ సినిమాతో వచ్చిన విజయ్ ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. ఇప్పుడు విజయ్ కి పాన్ ఇండియన్ స్టార్ గా దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది.
ఈ క్రమంలో విజయ్ నెక్స్ట్ సినిమాకి ప్లాన్స్ జరుగుతున్నాయి. దాంతో విజయ్ నెక్స్ట్ చేయబోతున్న సినిమా ఏంటీ అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ చేస్తున్న సినిమా షూటింగ్ కంప్లీట్ కావచ్చింది. ఆ సినిమా రిలీజ్ కాగానే విజయ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమలో విజయ్ జంటగా ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ ని పరిశీలిస్తున్నారట.
Vijay : ఈ ముగ్గురికి ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ ఉంది.
అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కించబోతుండగా పూజా హెగ్డే అయితే అన్ని రకాలుగా పర్ఫెక్ట్ అని అనుకున్నారట. ఇక ఇదే నిజమైతే పూజా హెగ్డే కి కోలీవుడ్ లో ఫస్ట్ డేబ్యూ సినిమా అవుతుంది. కాని ఇప్పుడు పూజా కి ఆ ఛాన్ దక్కడం డౌటే అంటున్నారు. అందుకు కారణం రేస్ లో మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా వచ్చి చేరడమే. ఇప్పుడు రష్మిక మందన్న తో పాటు కియారా అద్వానీ ల పేర్లు పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ ముగ్గురికి ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ లో క్రేజ్ ఉంది. మరి ఈ ముగ్గిరిలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.