NewsOrbit
న్యూస్

ఏం “బాబూ” ఏం చేద్దాం…? లాబీయింగ్ చేద్దామా, వేచి చూద్దామా…!

ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వేరే పార్టీలపై ప్రభావం చూపిస్తుందా…?? ఒక పార్టీ అంతర్గత మార్పు ఇతర పార్టీల్లో అంతర్గత చర్చలకు దారితీస్తాయా..?? సాధారణంగా తీయదు..!
కానీ మన రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి మార్పు మాత్రం టీడీపీలో కొత్త అనుమానాలు కలిగిస్తుంది. భిన్న పరిస్థితులు సృష్టిస్తుంది. బాబుకి దారులు మూసేస్తుంది. ఆ దారులు, అనుమానాలు, భిన్న పరిస్థితుల సమాహారమే ఈ “న్యూస్ ఆర్బిట్” మార్కు కథనం. ఒక్కోటి చర్చించుకుందాం లోతుగా పదండి.

కొత్త అనుమానాలేమిటి..??

* టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా అగ్గిమీద గుగ్గిలంలా ఉవ్వెత్తున లేచే సోము వీర్రాజుకి అధ్యక్షుడు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి..?
* గడిచిన ప్రభుత్వ సమయంలోనూ.., గడిచిన ఏడాదిలోనూ జగన్ని, వైసీపీని మాట కూడా అనని సోము వీర్రాజుని ఎందుకు కుర్చీ ఎక్కించినట్టు…?
* పోనీ కన్నాని కాదనుకుంటే…!! పురంధేశ్వరికో.., సుజనాకో.., కామినేని శ్రీనివాస్ కో.., మాధవ్ కో.. ఇస్తారు అనుకుంటే ఈ సోముని ఎందుకు తీసుకొచ్చినట్టు..??

 


టీడీపీని ఇరుకున పెట్టడానికేనా..? బాబుకి పొగ పెట్టడానికేనా..? సందర్భం ఉన్నా, లేకపోయినా చంద్రబాబుపై నోరెత్తి పోసెయ్యడానికేనా..?? అసలే కొనఊపిరితో ఉన్న టీడీపీ నుండి కొందరు కాపులను లాగేసి, బాబుని బలహీనం చేయడానికేనా..? జగన్ ని ఏమి అనకుండా… జాగ్రత్తగా చీకటి బంధం కొనసాగించడానికేనా…? జగన్ ని విమర్శించకుండా.., జాగ్రత్తగా డీల్ చేయడానికేనా..??
(పాపం ఇలా టీడీపీ శ్రేణుల్లో ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు))

భిన్న పరిస్థితులేమిటి…??

* నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కన్నా వ్యతిరేకించారు. అదే సమయంలో కామినేని శ్రీనివాస్ కోర్టులో పిటిషన్ వేశారు. కొన్నాళ్ల తర్వాత కామినేని, సుజనా చౌదరిలు ఇద్దరూ నిమ్మగడ్డతో రహస్య మంతనాలు జరిపారు. అంటే ఆ వ్యవహారంలో టిడిపికి కొంత అదనపు బలం చేకూరింది.., జగన్ బృందం కొంత ఇరుకున పడింది. అమరావతి విషయంలోనూ అదే జరిగింది. కన్నా జగన్ ని గట్టిగా విమర్శింస్తుండడం, నిలదీస్తుండటంతో టీడీపీకి ఎక్కడా లేని అదనపు సంతోషం వచ్చేసింది.
ఇప్పుడు ఇక ఆ పప్పులు ఉడకకపోవచ్చు. సోము వీర్రాజు ఇటువంటి విషయాలపై అంతగా స్పందించరు. పార్టీ నిర్ణయమే తమ నిర్ణయం అంటారు. “టీడీపీ విషయంలో, బాబూ విషయంలో అయితే సోము వీర్రాజు తన సొంత అభిప్రాయాలను గట్టిగా, బలంగా చెప్పేసారు.., కానీ జగన్ విషయంలో ఇప్పుడు అలా చెప్పే పరిస్థితి లేదు, ఉండదు. మరో రెండేళ్లు వైసీపీ, బీజేపీ బంధం సున్నితంగా ఉండాలి. అందుకే సోము వీర్రాజు పెద్దగా స్పందించరు. అంటే టీడీపీకి ఇక ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపితో ఒరిగేది ఏమి ఉండదు. ఇది ఒకరకంగా భిన్న పరిస్థితి. బాబూ ఎలా ఎదుర్కొంటారో..??

బాబుకి మూసుకుపోయిన దారులేమిటి..??

పైన అనుమానాలు.., భిన్న పరిస్థితులు చూసుకుంటే బాబుకి మూసుకుపోయిన దారులు ఇట్టే అర్ధమయినట్టే. వీర్రాజు చీటికీ మాటికీ బాబుని టార్గెట్ చేస్తే రాజకీయంగా బాబుకి ఇబ్బందులు తప్పవు. బిజెపితో భవిష్యత్తులో కలిసి నడుద్దామనుకుంటున్న బాబుకి చుక్కలు తప్పవు. అక్కడక్కడా కేంద్ర పెద్దలతో లాబీయింగ్ చేసుకుంటూ నెట్టుకొస్తున్న బాబుకి ఈ చిక్కులు తప్పవు. ఇక అటువంటి దారులన్నీ మూసుకున్నట్టే. అందుకే “బాబు గారూ ఏం చేద్దాం..! మరో దారిన లాబీయింగ్ చేద్దామా..? వీర్రాజు ఉద్దేశం బయటపడే వరకు వేచి చూద్దామా..?

 

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju