ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాకి పనులు వేగవంతం అయ్యాయి. ఇటీవల ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కెజీఎఫ్ నిర్మాతలు హోంబలే నిర్మాణ సంస్థ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. కెజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సాధించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అన్న టైటిల్ తో ప్రభాస్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.
కాగా ఈ సినిమా కి దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ ని కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మేకర్స్ ఇటీవలే కాస్టింగ్ కాల్ ని అనౌన్స్ చేశారు. సలార్ లో నటించేందుకు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నట్టుగా ప్రకటించిన మేకర్స్ వన్ మినిట్ వీడియో తో అప్లై చేయాల్సింది గా తెలిపారు. దాంతో భారీ సంఖ్యలో అప్లికేషన్ వచ్చాయంటున్నారు. డార్లింగ్ సినిమాలో ఏ చివరన కనిపించినా చాలన్నట్టుగా ఊహించనంత మంది అప్లికేషన్ పెట్టినట్టు సమాచారం.
అయితే ఈ కాస్టింగ్ కాల్ కేవలం జూనియర్ ఆర్టిస్టుల కోసమే నిర్వహించినట్టు సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ రూపొందించబోతున్నారు కాబట్టి వందల సంఖ్యల్లో జూనియర్ ఆర్టిస్టులు అవసరం పడతారు. ఈ క్రమంలోనే ఈ కాస్టింగ్ కాల్ నిర్వహించినట్టు చెప్పుకుంటున్నారు. కాగా కొంతమంది మాత్రం ప్రభాస్ సినిమాకి కాస్టింగ్ కాల్ ఏంటీ అని మాట్లాడుకుంటున్నారట. ఒకరకంగా చెప్పాలంటే ఇలా ప్రభాస్ సినిమాకి కాస్టింగ్ కాల్ నిర్వహించడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈ సినిమా 2021 జనవరి నుంచి షుటింగ్ మొదలవబోతోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!