శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం చేసిన వాళ్ళలో ఒక్క నిఖిల్ మాత్రమే బాగా సకస్ అయ్యాడు. వాస్తవంగా హీరోగా సెటిలవ్వాల్సింది వరుణ్ సందేష్. అందరూ అదే భావించారు. హ్యాపీ డేస్ తర్వాత వరుణ్ దూకుడు కూడా అలానే ఉండింది. కాని ఒకసారిగా ఫేడవుట్ అయ్యాడు. అసలు ఏ అంచనాలు లేని నిఖిల్ మాత్రం ఈరోజు టాలీవుడ్ లో ఒక క్రేజ్ ని సంపాదించుకున్నాడు.
హీరోగా మారిన దగ్గర్నుంచి కమర్షియల్ సినిమాలని కాకుండా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ సినిమాలనే చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఆమధ్య కాస్త రేస్ లో వెనకబడ్డ నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. దాంతో మరో క్రేజీ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ’18 పేజెస్’ అన్న టైటిల్ తో రూపొందబోయో ఈ సినిమా కూడా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో నిర్మించనున్నారట. ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో బాధపడుతూ ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో అవన్ని రూమర్స్ అని తెలుస్తుంది.
ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. కొత్త రకమైన క్యారెక్టర్ లో నిఖిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని ఆ క్యారెక్టర్ ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని చిత్ర బృందం అంటున్నారు. ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించనున్నాడు. అనూ ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ కి సీక్వెల్ ‘కార్తికేయ 2’ చేయబోతున్నాడు నిఖిల్.