NewsOrbit
న్యూస్

ఇండైరెక్టుగా జగన్ ఇమేజి దెబ్బతింటోంది బాసూ!

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేయాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చూస్తోంది. అయితే, అందులో చిత్తశుద్ధి ఎంత.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నేనంటారు రాజకీయ విశ్లేషకులు.ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. నిజానికి విశాఖ, ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధాని. ఉమ్మడి తెలుగు రాష్ట్రం హైద్రాబాద్‌ తర్వాతి స్థానం విశాఖదే.

 

 

దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రంవిభజన తర్వాత కూడా విశాఖ అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టలేదు. చంద్రబాబు హయాంలో విశాఖ చుట్టూ చాలా పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి. ఇప్పుడూ దాదాపుగా అదే జరుగుతోందని వారంటున్నారు

ఇతరత్రా రాజకీయాల సంగతి పక్కన పెడితే, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ మాటేమిటి.? ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను మార్చుతామంటోన్న ప్రభుత్వం, విశాఖలో పరిశ్రమల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.? యుద్ధ ప్రాతిపదికన పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం, ఆ తనిఖీలు నిర్వహించిందా.? లేదా.? నిర్వహిస్తే సాయినార్‌ పరిశ్రమలో ఎందుకు ప్రమాదం చోటు చేసుకుంది.? చిన్న చిన్న ప్రమాదాలు వేరు.. ప్రమాదకర వాయువులు లీక్‌ అవడం వేరు. ప్రమాదకర వాయువులు లీక్‌ అయితే.. ఆ ప్రభావం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏదిఏమైనా, విశాఖ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా వున్న విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌పై ఇలాంటి ఘటనల ద్వారా దెబ్బ పడితే.. అది రాష్ట్రానికే తీవ్ర నష్టం.


విశాఖలో ఇటీవలే ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి విషవాయువులు లీక్‌ అవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంస్థలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖుడి బంధువు కీలక ‘పొజిషన్‌’లో వున్నాడనే ఆరోపణలు అప్పట్లో విన్పించిన విషయం విదితమే. ఆ కారణంగానే, హుటాహుటిన ముఖ్యమంత్రి విశాఖ వెళ్ళారనీ, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించారనీ విపక్షాలు విమర్శించాయి. అయితే, దేశాన్ని కుదిపేసిన ఆ దుర్ఘటన, విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీసిందన్నది నిర్వివాదాంశం.వైజాగ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ ఇండైరెక్టుగా దెబ్బతింటున్న ట్లు కనిపిస్తోంది. ఇప్పుడే ముఖ్యమంత్రి ఆ డ్యామేజీ ని సరి చేసుకోవడం ఎంతైనా అవసరమంటున్నారు












author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju