NewsOrbit
రాజ‌కీయాలు

పార్క్ హయాత్ నిమ్మగడ్డ సీసీటీవి లీకేజ్ వెనుక సెన్సేషనల్ కోణం !

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బిజెపికి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లతో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నిమ్మగడ్డ వారిని కలవడంపై వైకాపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వారి రహస్య భేటీ వెనుక కుట్ర కోణం దాగి ఉందని వైసీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులుగా వైకాపా నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని తీవ్రంగా విమర్శించడం చూస్తున్నాం.

అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరో కీలక కోణం దాగి వుందని అంటున్నారు. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం ఎస్ఈసీ పదవిలో లేరు. అయన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కింద లెక్క. ఆయన ఇప్పుడు ఎవరిని కలిసినా ప్రభుత్వానికి, ప్రజలకు వచ్చే నష్టము లేదు, లాభము లేదు. అయినా ఆ విషయం తీవ్ర రచ్చ చేయడానికి వేరొక కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. అది ఏమిటంటే..వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై ఇటీవల 108 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్ట్ విషయంలో ఆరోపణలు వచ్చాయి. 108 అంబులెన్సులకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టు రద్దు చేసి మరీ విజయసాయి రెడ్డి వియ్యంకుడికి చెందిన కంపెనీకి అప్పగించారని,రివర్స్ టెండరింగ్ కు వెళ్లకుండా సదరు కంపెనీకి వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారని దీనిలో దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయి రెడ్డి తన అల్లుడికి మేలు చేసేందుకే అరబిందో సంస్థ కు 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యత అప్పగించారని వారు అంటున్నారు.

టీడీపీ ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో విజయసాయి రెడ్డి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందంటున్నారు. దీనిపై అయన ఏమి మాట్లాడలేక పోతున్నారని, అందుకే మీడియా దృష్టి మళ్లించేందుకు వేసిన మాస్టర్ స్కెచ్ లో భాగం అని రాజకీయ వర్గాలలో టాక్. విజయసాయి రెడ్డి సన్నిహితుడైన సుబ్బిరామిరెడ్డి సహకారంతో ఈ స్కెచ్ వేశారంటున్నారు. త్వరలో ఇలాంటి వ్యూహాలు మరెన్నో చూడవచ్చని చెప్పుకొంటున్నారు.

విజయసాయి రెడ్డిపై విశాఖలో భూఅక్రమణ ఆరోపణలు కూడా ఉన్నాయని, అవి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju