NewsOrbit
రాజ‌కీయాలు

అప్పు.. తప్పు.. ముప్పు..! జగన్ మదిలో కొత్త ఆలోచన..!!

cm jagan planning for new team

మహాభారతం క్లైమాక్స్ లో మాత్రమే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ప్రస్తుత రాజకీయ రణక్షేత్రం నిరంతరం కురుక్షేత్ర యుద్ధమే. అక్కడ అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసి యుద్ధంలో సాయం చేశాడు. ఈ రాజకీయ యుద్ధంలో పరిపాలనను పరిగెట్టించే నైపుణ్యం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉంది. ఏడాదిన్నర పాలనలో తనదైన మార్క్ చూపించారు. ఎంత సీఎం అయినా.. సలహాలు, సూచనలు తప్పనిసరి. అలా సీఎంకు రాజకీయ, ఆర్ధిక సలహాదారుల అవసరం ఉంటుంది. ప్రస్తుతం సీఎం జగన్ కు రాజకీయ సలహాదారులు ఉన్నా.. ముఖ్యంగా ఆర్ధిక సలహాదారుల అవసరం మరింత ఉంది. ఈ నేపథ్యంలో సీఎం వీరిపై దృష్టి పెట్టారని తాజా సమాచారం.

cm jagan planning for new team
cm jagan planning for new team

ఆర్ధిక సలహాదారుడి వేటలో..

సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు. ఆర్ధికంగా చాలా భారం ఉన్నా.. జగన్ ఈ ఏడాదిన్నరలో చేసి చూపించారు. అంతవరకూ సంతోషమే. కానీ.. ఇన్ని ఫలాలు నిరంతరాయంగా అమలవ్వాలంటే రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావాలి. అదే కష్టంగా ఉంది. దీనిపై జగన్ ఓ నిర్ణయం తీసుకుంటున్నారు. నిపుణుడైన ఆర్ధిక సలహాదారుడిని నియమించుకుని.. ఆయనకు ఓ ఐఏఎస్ ను జత చేస్తే.. ప్రభుత్వాన్ని సంక్షేమంలో మరింత పరుగులు పెట్టించవచ్చనేది జగన్ ఆలోచన. వచ్చే మార్చికల్లా ఓ నిపుణడిని ( గతంలో ఆర్ధికమంత్రిగా సేవలు అందించిన) సలహాదారుడితోపాటు మరికొందరిని నియమిస్తే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఏం చేయాలనేదానిపై స్పష్టత వస్తుందని ఆలోచన.

స్పష్టమైన వైఖరితో సీఎం జగన్..

ఇప్పటికే పార్టీలోని కొందరిని సలహాదారులుగా నియమించారు జగన్. అయితే.. పార్టీ మీద అభిమానం ఉంటే కాదు.. ప్రభుత్వాన్ని నడిపించే ప్రణాళికలు వేసి సీఎం పని సులువు చేయాలి. అలా చేయనివారిని జగన్ పక్కన పెడుతున్నారు. మరికొందరు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తోంది. పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు, విదేశఈ ఎఫ్ డీఐలు రావట్లేదు. ఇందుకు అనేక రాజకీయ కారణాలు, ప్రతిపక్షాల వైఖరి కూడా కారణం అవుతున్నాయి. వీటన్నింటిని అధిగమించి రాష్ట్రాన్ని నడిపించాలంటే ఇప్పుడున్న ఆర్ధిక సలహాదారుల ప్యానెల్ ను మరింత పటిష్టం చేయాలి. అలా చేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై బలమైన ముద్ర వేయొచ్చనేది సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు ప్రయత్నాలు ప్రారంభించనట్టు తెలుస్తోంది.

 

 

Related posts

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju