NewsOrbit
రాజ‌కీయాలు

పాత గవర్నర్ మాదిరి వ్యవహరించవద్దు

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. గత గవర్నర్ నరసింహన్ కూడా ఇలాగే వ్యవహరించేవారని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి వీహెచ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై వీహెచ్ మాట్లాడుతూ  ప్రజా సమస్యలపై గవర్నర్‌ను కలవాలని తాము ఎంతగా ప్రయత్నిస్తున్నా… వీలుపడటం లేదన్నారు.  పాత గవర్నర్ మాదిరి వ్యవహరించరాదని తమిళిసైని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలయ్ బలయ్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకుల బొమ్మలు లేకపోవడాన్ని కూడా వీహెచ్ తప్పుబట్టారు. పార్టీలకు అతీతంగా దత్తాత్రేయ నిర్వహించే ఈ కార్యక్రమంలో తమ ఫోటోలు కూడా పెట్టాలని ఆయన నిర్వాహకులను కోరారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన తరువాత దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో లేదో అని తాను సందేహించానని… కానీ ఆయన మాత్రం తన ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ ఈ కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని వీహెచ్ చెప్పారు.

జలవిహార్‌లో అలయ్‌ బలాయ్‌ కార్యక్రమం జరిగింది. అలాయ్‌ బలాయ్‌లో హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు గవర్నర్‌ దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

Leave a Comment