NewsOrbit
రాజ‌కీయాలు

జెడి అడుగులు అటువైపే!

సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరాలని నిర్ణయించుకోవడమో కనీసం చేరే విషయాన్ని పరిశీలించడమో నిజమని తేలిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిర్ధారించారు. బుధవారం ఆయన మీడియోతో మాట్లాడుతూ, లక్ష్మీనారాయణ టిడిపిలో చేరితే తప్పేంటని ప్రశ్నించారు. దానితో ఆ విషయంలో బయటకు వచ్చిన వార్తలు ఉత్తి పుకార్లు కావని ధృవపడింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిబిఐ జాయింట్ డైరక్టర్‌గా పని చేసిన లక్ష్మీనారాయణ వైఎస్ జగన్‌పై కేసులను దర్యాప్తు చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నీకది నాకిది పద్ధతి కింద అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై జగన్‌ను అరెస్టు చేసింది కూడా ఆయనే. జెడి లక్ష్మీనారాయణగా పేరు తెచ్చుకున్న ఆ అధికారి డెప్యుటేషన్ పూర్తి కాగానే సొంత క్యాడర్ రాష్ట్రం అయిన మహరాష్ట్రకు వెళ్లిపోయారు. తర్వాత కొన్నాళ్లకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రజాసేవకు దారి ఎంచుకునే ముందు ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలంటూ కొన్నాళ్లు పర్యటనలు చేసారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఆయనే ప్రకటించారు. అప్పటినుంచీ ఆయన రాజకీయ ప్రస్తానంపై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న జెడి టిడిపిలో చేరుతున్నట్లు మీడియా రిపోర్టు చేసింది. అయితే కొద్ది సేపటికి జెడి తాను టిడిపిలో చేరబోవడం లేదని వివరణ ఇచ్చారు. ఈలోపే వైసిపి నాయకుడు బొత్స సత్యనారాయణ విలేఖరుల సమావేశం పెట్టి,  అదుగో చంద్రబాబు, లక్ష్మీనారాయణ ముందు నుంచీ తోడుదొంగలు అని వ్యాఖ్యానించారు.

నేడు చంద్రబాబు ఈ విషయంపై మాట్లాడుతూ, అప్పుడు సిబిఐ అధికారి హోదాలో జగన్‌పై కేసులు దర్యాప్తు చేసిన కారణంగా ఇవాళ లక్ష్మీనారాయణ టిడిపిలో చేరడం తప్పవుతుందా అంటూ ప్రశ్నించారు. విమర్శలకు తావు ఇవ్వడం ఇష్టం లేకనే టిడిపిలో జెడి చేరడం ఆగిపోయిందని అంటున్నారు. అది తాత్కాలికమో, శాశ్వతమో చూడాలి.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

Leave a Comment