NewsOrbit
రాజ‌కీయాలు

Telangana Assembly: అసెంబ్లీ సాక్షిగా లక్షకుపైగా ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటన..!!

Telangana Jobs: TS Jobs Full Details By Here

Telangana Assembly: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విపక్షాలు ఎప్పటినుండో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వివిధ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల తరపున అనేక ఆందోళనలు చేపడుతూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే నిన్న వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో.. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రేపు టీవీ చూడాలని.. 10 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే కెసిఆర్ చెప్పినట్టుగానే నేడు అసెంబ్లీ సాక్షిగా ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో లక్షా 2, 250 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీనిలో భాగంగా కొత్తగా 91,147 ఖాళీలు ఉండగా వాటిలో 80,039 పోస్టులకు… నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో తెలంగాణ నిరుద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Telangana plans to hike reservation for Muslims, Special Assembly Session on Sunday - India News

ఇక ఇదే సమయంలో 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చేశారు. అటెండర్ నుండి ఆర్డిఓ వరకు స్థానికులకే అవకాశం కల్పిస్తున్నట్లు..తెలిపారు. అంతేకాకుండా ఇక నుండి  ప్రతియేటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అంత మాత్రమే కాక గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లకు పెంపు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పై కేసీఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణకు సంబంధించి కొన్ని సమస్యల విషయంలో కేంద్రం సహకరించడం లేదని తెలిపారు.

KCR Praised NTR In Telangana Assembly

దేశంలోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల విషయంలో అర్ధరహితమైన వివాదం నడుస్తుందని ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగాల సమస్య.. తీవ్ర తరం అయిందని సుప్రీంకోర్టు దాకా వెళ్లిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే ఉద్యోగ నియామకాల విషయంలో అర్థరహిత వివాదాలు తలెత్తాయి అని కెసిఆర్ ఆరోపించారు. ఏది ఏమైనా దాదాపు లక్షకుపైగా ఉద్యోగాలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju