NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ తక్షణ కర్తవ్యం, తక్షణ ప్రణాళిక ఇదేనా..?

 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అయన ఏమి చేయనున్నారు. మూడు, నాలుగు నెలల పాటు తనను మానసిసంగా ఇబ్బంది పెట్టి తన హోదాకు దూరం చేసిన ప్రభుత్వంపై కక్ష తీర్చుకోనున్నారా ? లేదా ప్రభుత్వంతో రాజీ మార్గాన వెళ్తారా? తనకు మళ్లీ తన హోదా దక్కడంతో కీలకమైన పాత్ర పోషించిన బీజేపీతో సయోధ్యగా ఉంటారా? తనకు పరోక్షంగా సహకరించిన చంద్రబాబు, టిడిపితో అంతర్గతంగా స్నేహపూర్వకంగా ఉంటారా? తన కులం మచ్చ వేసి తనను కుల సహితంగా విమర్శించిన సీఎం జగన్ పై దూకుడుగా వెళతారా? అసలు ఏం చేయనున్నారు? నిమ్మగడ్డ రమేష్ kjjకుమార్ పనితీరు, వ్యవహార శైలి ఎలా ఉండనుంది. నిజానికి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయనపై ఈ తరహా విశ్లేషణలు, ఆలోచనలు మనం మాట్లాడుకోకూడదు కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇది చర్చించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది.

 

 

Nimmagadda ramesh kumar stands clearly on local body elections
Nimmagadda ramesh kumar stands clearly on local body elections

దేని దేనిపై విచారణ చేయిస్తారో..?

అయన కార్యాలయంలో జరుగుతున్న వాస్తు మార్పులపై ప్రస్తుతానికి ఎంక్వయిరీకి వేశారు. అయన కార్యాలయంలో అయన చైర్ మార్పు చేయడం అంటే అక్కడ ఉండేది ఇక్కడకు మార్చారని, జరుగుతున్న మార్పులు చేర్పులు కూడా ఆయనే వాస్తుకు విరుద్ధంగా ఉన్నాయని చేయిస్తున్నారని మీడియాలో ప్రచారం జరగడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. నిమ్మగడ్డ తిరిగి జాయిన్ కాకముందే కార్యాలయంలో మార్పులు జరుగుతున్నాయని, ఎవరి ఆదేశాలతో ఇవి చేయిస్తున్నారు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అదే విధంగా రేపో, ఎల్లుండో ఫైల్స్ మిస్ అయ్యాయని కూడా విచారణ చేయించవచ్చు. ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే ఎన్నాళ్ళు అయన కార్యాలయానికి దూరంగా ఉన్నారు. కొన్ని రహస్యమైన ఫైల్స్ అయన సిస్టమ్ లో కావచ్చు, మెయిల్ లో కావచ్చు ఉండి ఉండవచ్చు. సో.. ఆ ఛాన్స్ అయితే ఉండి. అలాంటివి ఏమైనా జరిగితే కోర్టులో పిటిషన్ వేస్తారా? లేదంటే విచారణ కు ఆదేశాలు జారీ చేస్తారా ? అనేది కీలకమైన అంశంగా మారింది. ఇదే సందర్భంలో అయన ఏ నిర్ణయం తీసుకొని ఎటువంటి దర్యాప్తు, విచారణ కోరాలన్నా ప్రభుత్వం సహకారం ఉండాలి
ఆయన సిబ్బంది సహకారం ఉండాలి. ఈ విషయంలో ఆయనకు ప్రభుత్వ ఎంతమేర సహకారం అందిస్తుంది అనేది కీలకమైన విషయం.

స్థానిక సంస్థలపై ఏమి ఆలోచిస్తారు?

స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తారా? యధాతధంగా కోసాగిస్తారా? అనేది ఇప్పుడు సందేహంగా మారింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసేందుకే అయన మొగ్గు చూపుతారని మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబందించిన రెండు ఆర్డినెన్సు కు కాలం చెల్లడం వల్ల తాజాగా ఆర్డినెన్సు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు అది ఇచ్చే అవకాశం లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి కరోనా పూర్తిగా వెళ్లిన తరువాత ఫ్రెష్ గా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు వాదనల సందర్భంలో ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదనీ, నామినేషన్ లలోనూ, ఏకగ్రీవాలలోనూ అక్రమాలు జరిగాయని, అధికార పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందనీ ఆయనే స్వయంగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వీటన్నింటి కారణాలుగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ను మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?