NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పాడు… ఇప్పుడు అన్నీ పార్టీలు తిరుగుతున్నాడు..! అయినా నో ఓపెనింగ్స్?

రాజకీయాల్లో అందరూ అంటే ఏమో అనుకుంటాం కానీ రాత్రికిరాత్రే బండ్లు ఓడలు అవుతాయి…. ఓడలు బండ్లు అవుతాయి. దీనిని ఎంతో మంది రాజకీయ నాయకులు నిరూపించారు కానీ ఒక్కరికే అనేకసార్లు దురదృష్టం తలుపు తట్టడం…. ఆ తలుపులు తెరచి దానిని సాదరంగా లోనికి ఆహ్వానించిన మన రాజకీయ నాయకుల సంఖ్య మాత్రం చాలా తక్కువ. అటువంటి కొద్దిమందిలో అమలాపురం మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు జి.వి.హర్షకుమార్ ఒకరు. ప్రస్తుతం అతని రాజకీయ భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్.

 

మొదటి అడుగే….

హర్షకుమార్ ఒకప్పుడు కాంగ్రెస్ టికెట్ పై అమలాపురం నుండి రెండు సార్లు విజయం సాధించారు. వైయస్ కు అనుంగు అనుచరుడిగా హర్షవర్ధన్ మంచి పేరు తెచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఏకపక్షంగా ఎంపీగా విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. మొదటి అడుగే ఎంతో తప్పుగా వేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరి 2014లో అమలాపురం పార్లమెంటు స్థానం నుండి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కట్ చేస్తే….

అవకాశాన్ని కాలదన్నుకున్నారా?

అమలాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న హర్షకుమార్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని అందరూ అనుకున్నారు. పైగా సమైక్య ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అతని వైపు కావాల్సినంత సానుకూలత ఉంది అని అభిప్రాయపడ్డారు. అయితే కేవలం తొమ్మిది వేల ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు హర్షకుమార్. సమైక్యాంధ్ర పార్టీ ఎత్తేయడంతో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికంగా సమాచారం జరిగింది. అయితే అదే సమయంలో అతనికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది వైసీపీ పార్టీ నుండి అతనికి ఆహ్వానం లభించింది. ఎంతైనా తన తండ్రికి ఆప్తుడు.. తనకు బాగా దగ్గర ఉంటే బాగుండు అని జగన్ ఆలోచించారు ఏమో కానీ…. కట్ చేస్తే….

పోయి పోయి భలే వారిని నమ్మారు….

టిడిపికి చేరువైనా హర్షకుమార్ దూకుడు చూసి వైసిపి నాయకులు అతనిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు వెనక్కి తగ్గారు. గత ఏడాది ఎన్నికల్లో అమలాపురం టికెట్ తనకే దక్కుతుందని హర్షకుమార్ ఆశించారు. అతనికి స్థానికంగా మంచి మద్దతు కూడా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఆ టికెట్ ను సెంటిమెంట్ కోసం రాజకీయం దివంగ‌త స్పీక‌ర్ మోహనచంద్ర బాలయోగి కుమారుడికి ఇచ్చి అతనికి సహకరించాలని హర్షకుమార్ ను కోరాడు. ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయం చేస్తామని మాట ఇచ్చారు కానీ హర్షకుమార్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఇక ఇలాంటి పరిస్థితులలో వైసీపీకి టీడీపీకి దూరంగా ఉన్నారు.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే హర్షకుమార్ మళ్లీ కాంగ్రెస్లో కి వెళ్తాను అని చివరికి ప్రకటించారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అతన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటుంది అని అందరూ భావించారు. వారికి ఇలాంటి దూకుడు గల నాయకులే కావాలి అయితే అతను తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను అని ప్రకటించి 24 గంటలు గడిచినప్పటికీ ఆ పార్టీ నుండి సానుకూల స్పందన లేకపోవడం గమనార్హం. హర్ష కుమార్ పరిస్థితికి ఏ పేరు పెడతారో ఇక మీ ఇష్టం….

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?