NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pavan Kalyan ; బీజేపీ – జనసేన ఇప్పుడు పవన్ భజన..!? ఫలితం తేడా కొడితే..!?

Pavan Kalyan: Reverse Attack on PK Fans..!?

Pavan Kalyan ; ఏపీ బీజేపీని చూస్తే ఒక్కోసారి నవ్వొస్తుంది. ఒక్కోసారి జాలేస్తుంది. ఒక్కోసారి కోపమొస్తుంది. ఒక్కోసారి అసహ్యం పుడుతుంది..! సగటున చాలా మందికి ఎప్పుడు గౌరవం, మర్యాద, అభిమానం మాత్రం పుట్టవు. రాష్ట్రాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు పట్టించుకోకపోయినా.., ఏపీ ప్రయోజనాలకు కేంద్రం ఏమి చేయలేకపోయినా.. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా.. ఏపీలో కీలకమైన విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్మేస్తున్నా… ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోయినా… మనకు హోదా ఇవ్వలేమని చెప్పి పక్కనున్న పుదుచ్చేరికి ఇస్తారని హామీ ఇచ్చినా… ఇలా ఏపీకి కేంద్ర బీజేపీ ఎన్ని దెబ్బలు వేస్తున్నా… ఎలాగోలా దాన్ని సమర్ధించుకుని.. ఒక్కోసారి ఎలా సమర్ధించాలో కూడా తెలియక, తికమక పడే ఏపీ బీజేపీ అంటే పైనున్న ఫీలింగ్స్ కలగడంలో తప్పేమి ఉండబోదు..!

Pavan Kalyan ; Alliance Effect After Tirupathi Results
Pavan Kalyan Alliance Effect After Tirupathi Results

Pavan Kalyan ; బీజేపీని మోస్తున్నది పవన్ ఒక్కరే..!

అందుకే ఏపీలో బీజేపీ జనసేనని నమ్ముకుంది. పవన్ కళ్యాణ్ చరిష్మా, ఆ సామాజికవర్గం ఓటు బ్యాంకు, ఆ సెంటిమెంటుని నమ్ముకుంది. అందుకే పవన్ భజనలో తరిస్తుంది. బీజేపీ పవన్ కళ్యాణ్ భజన చేస్తుంటే.. పవన్ బీజేపీకి ప్రచారం చేసి పెడుతున్నారు. ఏపీలో బీజేపీ అంటే పెద్ద పేరు మోసిన నేతలు ఎవరూ లేరు. పురంధేశ్వరికి కుటుంబ పరంగా పేరున్నా.. పార్టీ పరంగా లేదు. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి ఇలా… ఈ జాబితా మొత్తం పార్టీ పేరుని వాడుకుని, కేంద్రంలో అధికారంలో ఉన్నామనే ధీమాతో రాజకీయం చేస్తున్నారు తప్ప.. కేంద్రంలో బీజేపీ కనుమరుగైతే ఏపీలో ఈ నేతల్లో సగం మంది వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి అయితే ఏపీలో బీజేపీ జెండాకి బలం పవన్ కళ్యాణ్, బలగం జనసేన సైనికులు. వీళ్లకు ఉన్నదే కొంచెం. ఆ కొంచెం కూడా బీజేపీకి ధారపోస్తున్నారు. సో.. ఈ ధారా, ఆ భజన తిరుపతి ఉప ఎన్నికల్లో ఎంత మేరకు వర్కవుట్ అవుతుంది అనేది తేలిపోనుంది..

Pavan Kalyan ; Alliance Effect After Tirupathi Results
Pavan Kalyan Alliance Effect After Tirupathi Results

పొత్తు పొడిచాక… ఇదే తొలి సమరం..!!

ఏపీలో బీజేపీ- జనసేన మధ్య పొత్తు ఖరారై దాదాపు 15 నెలలు కావస్తుంది. కలిసి ఏ ప్రధాన ఎన్నికకు వెళ్ళలేదు. ఈ తిరుపతి ఉప ఎన్నిక మాత్రమే మొదటిది.., ప్రధానమైనది. సో.. ఈ ఫలితంతో ఈ పొత్తు మధ్య విషయం కూడా బయటకు వచ్చేస్తుంది. ఏపీ బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ నామ స్మరణ చేసుకుంటున్నారు. పవన్ జాతీయ స్థాయి నేత అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాగానే ఉంది. వాళ్ళ అవసరం కాబట్టి పొగడగా తప్పట్లేదు.. ఒకవేళ తిరుపతిలో ఫలితం తేడా కొడితే..? కనీసం డిపాజిట్లు రాకపోతే..!? కనీసం వాళ్ళు ఆశిస్తున్న లక్ష ఓట్లు కూడా రాకపోతే..? ఓటమి సాకుని కూడా పవన్ పైనే నెట్టేస్తారా..!? “మేము పవన్ ని పొగిడామ్.. మాకు పవన్ ఓట్లు వేయించలేదు. సో పవన్ దే తప్పు అంటూ సాకులు చూపుకుని జనసేనపైనే వేలు చూపిస్తారా..!? ఏమో బీజేపీ ఏమైనా చేస్తుంది. ఎవర్నైనా ఆకాశానికి తీసుకెళ్తుంది. ఎవరినయినా అక్కడి నుండి పడేస్తుంది..! ఈ ఎన్నిక ఫలితంతో పాఠాలు నేర్చుకోవాల్సింది పవనే.

author avatar
Srinivas Manem

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !