NewsOrbit
రాజ‌కీయాలు

Prashant Kishor: బీజేపీ పై ముప్పేట ఎటాక్ కి పీకే బీహార్ లో పునాది..??

Prashant Kishor: జాతీయ స్థాయిలో బీజేపీ తిరుగులేని పార్టీగా దేశంలో చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. 2014 నుండి పార్లమెంట్ పరంగా జరుగుతున్న ఎన్నికలలో కమలం వికసిస్తున్నే ఉంది. మరోపక్క ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే భవిష్యత్తు లేకుండా.. బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే నిన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టబోతున్నట్లు బీహార్ కి పరిమితం చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో రాబోయే  రెండు, మూడు నెలలో.. పదిహేడు వేల మందిని కలిసి వారి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అక్టోబర్ నెలలో గాంధీ జయంతి నాడు పాదయాత్ర బీహార్ లో మూడు వేల కిలోమీటర్లు చేస్తున్నట్లు తెలిపారు. PK Under ground work preparing in bihar to attacks on BJP

దీంతో పీకే ప్రకటన దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో పార్టీ తీసుకొస్తారని అందరూ భావించారు. కానీ ఆయన ప్రకటన చూస్తే బీహార్ కే పార్టీని పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. అయితే పీకే పార్టీ ప్రకటన..బీజేపీ నీ ముప్పేట అన్ని రకాలుగా ఇరుకున పెట్టే స్కెచ్ అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు కేసిఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ తీసుకోబోతున్నట్లు సంచలన డైలాగులు వేశారు. తీరా ఎన్నికల టైం వచ్చేసరికి కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవల బీజేపీ నీ గట్టిగా టార్గెట్ చేసుకుని కేసీఆర్ జాతీయస్థాయిలో  విమర్శలు చేస్తూ ఉన్నారు.

PK Under ground work preparing in bihar to attacks on BJP

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల పీకే పెట్టిన డిమాండ్లకు ఒప్పుకోకపోవడం..అదే టైంలో కాంగ్రెస్ కి నాయకత్వ లోపం ఉందని అది సరిచేసుకోవాలని పీకే సూచించటం అంతా తెలిసిందే. అయితే కమలం పార్టీని ఢీ కొట్టడానికి అటాకింగ్ మోడ్ లోకి వెళ్లడమే ప్లాన్ గా రంగం లోకి దిగుతూ ప్రశాంత్ కిషోర్… తన కొత్త పార్టీతో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతీయ పార్టీలతో ప్రశాంత్ కిషోర్ కి మంచి సంబంధాలు ఉండటంతో.. వీరందరితో కలిపి ఫెడరల్ ఫ్రంట్.. లేదా మూడవ కూటమి ఏర్పాటు చేయడానికి .. రెడీ అయినట్టు చెప్పుకొస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా బీహార్ లో పట్టు సాధించడానికి పీకే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వివరిస్తున్నారు. బీహార్ లో పట్టు సాధించి.. ఆ తర్వాత ప్రాంతీయపార్టీల నేతలు వైఎస్ జగన్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కెసిఆర్, స్టాలిన్ వీళ్ళందరినీ ఏకం చేసి.. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొట్టడానికి .. అండర్ గ్రౌండ్ వర్క్ బీహార్ నుండి పీకే ప్రిపేర్ చేస్తున్నట్లు.. రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju