NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ వివరణ ఇది

Advertisements
Share

AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధిచడంతో, ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. సీమన్స్ సంస్థ పేరు వాడుకుని గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు పేరుతో రూ.279 కోట్ల రూపాయలు దారి మళ్లించారని సీఐడీ కేసు నమోదు చేసింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు దారి మళ్లాయని దీనిలో చంద్రబాబు పాత్ర ఉందనేది అభియోగం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో స్కిల్ డవలప్ మెంట్ ప్రాజెక్టుపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.

Advertisements

What is this inner ring road case.. If found in this, Tihar Jail is guaranteed for Chandrababu

వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దానికి చంద్రబాబుదే కీలక పాత్ర అని కథనాలు వస్తుండగా, టీడీపీ అనుకూల మీడియాలో అసలు స్కామ్ యే జరగలేదనీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి జరుగుతున్న ఆరోపణలను ఖండించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు బోగస్ అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్టుని బోగస్ అనడం సరికాదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Advertisements

తనపైనా తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని అన్నారు సుమన్ బోస్. మార్కెటింగ్ లో భాగంగానే 90 : 10 ఒప్పందం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని ఆయన పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐటీ అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్ మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. 40 ప్రాంతాల్లో 200  ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. 2021 నాటికి 2.32 లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఈ సెంటర్ల ద్వారా నైపుణ్యం సాధించారని తెలిపారు. వారికి సర్టిఫికెటేషన్ ఇవ్వడంతో ఉద్యోగుల కూడా చేస్తున్నారని అన్నారు.

2016లో విజయవంతమైన ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందన్నారు సుమన్ బోస్. 2021 లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ప్రాజెక్టు అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలన్నారు. 2021 లో స్కిల్ డెవలప్ మెంట్ బాగా జరిగిందని ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా లెటర్ కూడా అందుకున్నామని చెప్పారు. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్ అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపలేదన్నారు. ఇదే తరహా ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశామని చెప్పారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు కోర్టులకు చెబుతామని ఆయన తెలిపారు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ..! ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందరేశ్వరి ఇచ్చిన క్లారిటీ ఇది


Share
Advertisements

Related posts

18000 కోట్ల మ్యాటర్ లో ప్రూఫ్స్ తో ప్రభుత్వాన్ని లాగుతున్నారు… జగన్ లో పారేషాన్?

CMR

Tamilnadu elections : మళ్లీ బరిలోకి చిన్నమ్మ?

siddhu

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ లో చరణ్ – ఎన్.టి.ఆర్ ..ఈ ఒక్క పాయింట్ చాలు వందేళ్ళు చెప్పుకోవడానికి ..!

GRK