పార్లమెంటరీ వారీగా చంద్రబాబు కొత్త టీం..! బీసీ, కాపులకు ప్రాధాన్యం.. !!

(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కీలక నాయకులు పార్టీకి, చంద్రబాబు కు గుడ్ బై చెపుతా వైసీపీ గూటికి చేరుతున్నారు. దీనితో నియోజక వర్గాలలో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టం నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..పార్టీకి ఏయే వర్గాలు దూరమయ్యాయి అనే దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.  పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకుని రావడం, 2024 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా చంద్రబాబు ఆపరేషన్ ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా పార్లమెంటరీ నియాజకవర్గాల స్థాయిలో కమిటీలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. సీనియర్ నేతలను నియోజక వర్గ ఇంచార్జ్ లగా, సమన్వయ కర్తలుగా నియమించారు. ఇందులో బీసీ, కాపు సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతున్నది. ఆదివారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ వారీగా అధ్యక్షులు, సమన్వయకర్తల వివరాలు వెల్లడించారు.

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడుగా కూన రవికుమార్,  విజయనగరం కు కిమిడి నాగార్జున,  అరకు పార్లమెంట్ కు సంధ్యారాణి,  విశాఖపట్నం కు శ్రీనివాస రావు, కాకినాడకు జ్యోతుల నవీన్ అనకాపల్లికి బుద్ధ నాగ జగదీశ్వరరావు,  అమలాపురం కు రెడ్డి అనంత కుమారి,  రాజమండ్రికి కొత్తపల్లి జవహర్, నరసాపురం కు తోట సీత రామ లక్ష్మి,  ఏలూరుకు గన్ని వీరాంజనేయులు,  మచిలీపట్నం కు కొనకళ్ల నారాయణరావు,  విజయవాడకు నెట్టెం రఘురాం,  గుంటూరు కు శ్రావణ్ కుమార్,  నరసరావుపేటకు జీవీ ఆంజనేయులు,  బాపట్లకు ఏలూరు సాంబశివరావు,  ఒంగోలుకు బాలాజీ,  నెల్లూరుకు అబ్దుల్ అజిర్, తిరుపతికి నరసింహ యాదవ్,  చిత్తూరుకు పులపర్తి నాని,  రాజంపేట కు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి,  కడప కు లింగారెడ్డి,  అనంతపురం కు శ్రీనివాసులు,  హిందూపురం కు బీకే పార్థసారథి, కర్నూలు కు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,  నంద్యాలకు గౌర వెంకటరెడ్డి లను అధ్యక్షులుగా  నిర్మించారు.

మచిలీపట్నం, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్త గా కొండపల్లి అప్పలనాయుడు,  కాకినాడ, అమలాపురం కు బండారు సత్యనారాయణ మూర్తి,  శ్రీకాకుళం,  విజయనగరం కు గణబాబు,  విశాఖపట్నం అనకాపల్లి కి నిమ్మకాయల చినరాజప్ప,  నర్సారావుపేట బాపట్లకు పితాని సత్యనారాయణ,  రాజమండ్రి నర్సాపురం కు గద్దె రామ్మోహన్,  అరకు కు నక్కా ఆనందబాబు,  ఏలూరు విజయవాడకు ధూళిపాల నరేంద్ర, తిరుపతి చిత్తూరుకు నరసింహారెడ్డి,  కడప రాజంపేట కు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కర్నూలు నంద్యాల కు ప్రభాకర్ చౌదరి, అనంతపురం హిందూపురం కు బిటి నాయుడు,  ఒంగోలు నెల్లూరు కు బీసీ జనార్దన్ రెడ్డి లు సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.