చంద్రబాబు, జగన్ ల మధ్య నలిగిపోతున్న నాయకుడు…??

తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగి రాజకీయ ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక నేతగా ఎదిగారు. మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లోకి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక నేతగా రాణించి కాంగ్రెస్ పార్టీతో ప్రజారాజ్యం కలిసిపోవడంతో మంత్రి పదవి అందుకుని రాజకీయాల్లో మరింత రాటు తేలారు. ఆ తర్వాత టిడిపిలో జాయిన్ అయినా గెలిచి మంత్రి గా వ్యవహరించి గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు.

Why Ganta Srinivas Rao skipped Chandrababu's Vizag Programme? | Tupaki Englishఅయితే ప్రస్తుతం అధికారం లో టిడిపి లేకపోవడంతో గత కొంత కాలం నుండి అధికారానికి అలవాటైన గంట శ్రీనివాస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళదామని భావిస్తున్నా… అటువైపు నుండి సిగ్నల్ రావటం లేదట. జగన్ చాలావరకు గంట శ్రీనివాస రాకని వ్యతిరేకిస్తున్నట్లు టాక్. మరోపక్క టిడిపిలో ఉన్న చంద్రబాబు… గంటా వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం చెందుతున్నట్లు సమాచారం. అందువల్ల ఇటీవల కొత్తగా నిర్మించిన ఇన్చార్జిల విషయంలో గంటకి ప్రాధాన్యత లేకుండా చంద్రబాబు చాణక్యంగా ఆలోచించి…. గంటా శ్రీనివాస్ ని ఆటలో అరటి పండుగ భావిస్తున్నట్లు టిడిపి పార్టీలో అంతర్గతంగా వినపడుతున్న టాక్. ముఖ్యంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పార్టీ వీడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో రెండు జిల్లాల కో-ఆర్డినేటర్ చేసి సైకిల్ దిగకాకుండా జాగ్రత్త పడ్డారు. 

మాజీ ఎమ్మెల్యే అయినా పల్లా శ్రీనివాసుని విశాఖ ప్రెసిడెంట్ చేసి చంద్రబాబు ఇద్దరిని వేరు చేయడం జరిగింది. దీంతో కొత్తగా విధించిన పదవుల విషయంలో గంటకి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవడం తో మరోపక్క వైసీపీ లోకి వెళ్దాము అనుకుంటే జగనే స్వయంగా అడ్డుపడటంతో ఇద్దరి మధ్యలో గంటా శ్రీనివాస్ పొలిటికల్ కెరియర్ నలిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.