NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ పరువు తీయడానికి కాకపోతే ఏమిటా మాటలు మంత్రివర్యా ?? 

తూర్పు గోదావరి జిల్లాకు దళిత యువ‌కుడు వరప్రసాద్‌కు శిరోముండ‌నం ఉదంతం ఏపీలో క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. అనంత‌రం ఈ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్‌లో

చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి లేఖ రాయ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. అయితే, ఈ ఎపిసోడ్‌లో ఏపీ మంత్రి విశ్వ‌రూప్ చేసిన కామెంట్లు సీఎం జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేశాయ‌ని అంటున్నారు.

వేదుల్లాపల్లె గ్రామానికి చెందిన వరప్రసాద్‌ అనే దళిత యువకుడు వైసీపీ నాయకుడికి వ్యతిరేకంగా ముని కూడలి ప్రాంతంలో ఇసుక లారీలను ఆపడానికి ప్రయత్నించాడు. ఈ విషయమై విచారణ నెపంతో పోలీసులు అతడిని జూలై 20న సీతానగరం పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు. ఆ తరువాత పోలీసులు త‌న‌ను తీవ్రంగా కొట్టి, శిరోముండనం చేసి టార్చర్‌ పెట్టినట్లు వరప్రసాద్‌ పేర్కొన్నాడు.

కాగా, ద‌ళి‌త యువ‌కుడి ఉదంతంలో మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ స్పందించ‌గా దానిపై విశ్వ‌రూప్ రియాక్ట్ అయ్యారు. దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్‌.. ఆయన రాజకీయ భవిషత్తు కోసం ఎంతకైనా జాతిని తాకట్టు పెడతారని విశ్వరూప్‌ దుయ్యబట్టారు. కేసులో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి.. నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. హర్షకుమార్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి మంత్రి విశ్వరూప్‌ హితవు పలికారు. ఇదే సమ‌యంలో నక్సలైట్లలో ఎవరైనా చేరవచ్చని మంత్రి విశ్వరూప్ మాట్లాడటం క‌ల‌క‌లం రేపింది.

వైసీపీ నేతల చేతిలో అవమానానికి, అనంత‌రం శిరోముండనానికి గురైన‌ బాధితుడు వరప్రసాద్ తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాన్నీ భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురై నక్సల్స్ లో చేరతానని రాష్టపతికి లేఖ రాయ‌డ‌మే అధికార పార్టీని ఇర‌కాటంలో పడేసింది. ఇలాంటి స‌మ‌యంలో మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి, అదే ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌కుడిని న‌క్సల్స్‌ దళంలో చేరమని చెప్పడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అన్యాయం జరిగితే న్యాయం చేయకపోగా హేళన మాట్లాడటం ఎంతవరకు సమంజసమ‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా, ద‌ళిత యువ‌కుడికి అవ‌మానం జ‌రిగిన‌ సంఘటనపై డీఐజీ దర్యాప్తు జరిపి ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసు వివరాలను తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జూలై 22న అధికారులను ఆదేశించారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju