YS Jagan Davos Tour: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం జగన్ చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతం అయ్యింది. దాదాపు రాష్ట్రంలో లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు పారిశ్రామికవేత్తలు కంపెనీలు ముందుకు రావడం జరిగాయి. సీఎం జగన్ పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు అవుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ₹1.25 లక్షల కోట్ల పెట్టుబడులు పై అదానీ, గ్రీన్ కో, అరబిందో లతో ఒప్పందం కుదిరింది. ప్రపంచ ప్రసిద్ధి కంపెనీ ఆర్సెల్లార్ మిట్టల్ ప్రపంచంలో తొలి సారి గ్రీన్ ఎనర్జీ పై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ పెట్టుబడులను మరింత రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. పంప్డ్ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రానుంది.
ఈ క్రమంలో ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఏపీలో పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ గ్రీన్ ఎనర్జీని వేదికగా చేసుకుని ఏపీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంది. ఇదే సమయంలో గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తుల దిశగా మచిలీపట్నంలో ఎస్ఈజెడ్ రానుంది. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. కాలుష్యం తగ్గించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ గ్రీన్ ఎనర్జీ వినియోగించుకుంటూ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఉత్పత్తులు సాధించే దిశగా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో డబ్ల్యూఈఎఫ్ తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనేక కార్యక్రమాలు అదేవిధంగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త నాలుగు పోర్ట్ లు త్వరలో వస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని… పోర్టు ఆధారిత… పెట్టుబడుల పారిశ్రామికరణపై దావోస్ లో సీఎం జగన్ చర్చలు జరుపుతూ ఉన్నారు. మరిముఖ్యంగా విశాఖ నగరంలో… హై టెక్నాలజీ సెంటర్ ఏర్పాటయ్యే రీతిలో… పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కావడం జరిగింది. టెక్ మహేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తో అనుసంధానం చేస్తూ.. ఉద్యోగాల కల్పనకు.. సీఎం జగన్ ఈ పర్యటనలో ఆ సంస్థ సీఈఓతో చర్చలు జరిపారు. దీంతో విశాఖలో కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంలో టెక్ మహీంద్రా కూడా ఓకే చెప్పటం జరిగింది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…