NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election: అచ్చంపేటలో రెండు సెంటిమెంట్లు .. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం పక్కా..మరో సెంటిమెంట్ ఏమిటంటే..?

Telangana Election: రాజకీయాల్లో సెంటిమెంట్ ను చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి అయితే  గెలుస్తారో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ప్రచారం బలంగా ఉంటుంది. ఆ సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అచ్చంపేటలో ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉంది.

1962 నుండి మొత్తం 13 సార్లు అచ్చంపేట నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే 12 సార్లు ఈ సెంటిమెంట్ రుజువు అయ్యింది. అచ్చంపేటలో విజయం సాధించిన అభ్యర్ధికి సంబంధించిన పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. 2009 లో ఒక్క సారి మాత్రమే ఆ సెంటిమెంట్ నకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ, లోక్ సత్తా పోటీ కారణంగానే టీడీపీ అధికారాన్ని కైవశం చేసుకోలేకపోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అత్యధిక స్థానాలు కైవశం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ప్రజారాజ్యం పార్టీ, లోక్ సత్తా పార్టీ అభ్యర్ధుల ఓట్ల చీలిక కారణంగా స్వల్ప ఓట్ల తేడాతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు పరాజయం పాలైయ్యారు. ఈ కారణంగా ఆ ఎన్నికల్లో సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పి రాములు విజయం సాధించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

Ink in elections

ఈ నియోజకవర్గంలో మరో సెంటిమెంట్ కూడా ఉంది. 1962 నుండి ఇప్పటి వరకూ జరిగిన 13 సార్లు జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన నేత ఎవరు లేరు. 1967, 72 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన పీ మహేంద్రనాథ్ 1978 ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 1983, 85 ఎన్నికల్లో రెండు సార్లు విజయం సాదించారు. ఆ తర్వాత పి రాములు 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎన్నికైయ్యారు. 2004 ఓటమి పాలైన పి రాములు మళ్లీ 2009 లో విజయం సాధించారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధి గా గువ్వల బాలరాజు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

ఇప్పుడు గువ్వల బాలరాజు హ్యాట్రిక్ పై కన్నేశారు. గువ్వల బాలరాజు గత రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ కృష్ణ 9వేల, 11 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా బాలరాజుకు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ తరుపున వంశీకృష్ణ పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్ధిగా దేవని సతీష్ మాదిగ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గువ్వల బాలరాజు వరుసగా మూడో సారి గెలిచి నియోజకవర్గ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో వంశీకృష్ణ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, బాలరాజు గెలిస్తే బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందన్న టాక్ నడుస్తొంది.

అచ్చంపేట నియోజకవర్గ రికార్డును ఒక సారి పరిశీలిస్తే..

1962 లో కాంగ్రెస్ అభ్యర్ధి నాగన్న విజయం సాధించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1967,72,78 ఎన్నికల్లో అదే ట్రెండ్ కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1982లో టీడీపీ అభ్యర్ధి గా పి మహేంద్రనాథ్ విజయం సాధించగా, కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. 1985 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్ధి మహేంద్రనాథ్ విజయం సాధించారు. టీడీపీ అధికారాన్ని నిలుపుకుంది. 1989 లో కాంగ్రెస్ అభ్యర్ధి డి కిరణ్ కుమార్ గెలువగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1994, 1999లో టీడీపీ అభ్యర్ధి గా పి రాములు విజయం సాధించగా, తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004 లో కాంగ్రెస్ అభ్యర్ధి వంశీకృష్ణ గెలవగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 లో టీడీపీ అభ్యర్ధి పి రాములు విజయం సాధించినప్పటికీ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014, 2018 లో టీఆర్ఎస్ అభ్యర్ధి గువ్వల బాలరాజు గెలిచారు. టీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.

Telangana Election: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరో సారి దాడి..ఈ సారి ఎవరు దాడి చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju