NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana BJP: బండి సంజయ్‌ అభిమానులకు ఊరట .. జాతీయ కార్యవర్గంలో చోటు

Telangana BJP: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ గుడ్ న్యూస్ అందించింది. బండికి పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు ఊరట చెందారు. ఇటీవల ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు నిరుత్సాహానికి గురైయ్యారు. అయితే బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది కానీ అవన్నీ ప్రస్తుతానికి ఊహగానాలుగానే మిగిలాయి. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Bandi Sanjay

 

ఏపీకి చెందిన సత్య కుమార్ కు జాతీయ కార్యదర్శిగా మరో సారి అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సత్యకుమార్ ను నియమించే అవకాశాలు ఉన్నాయని తొలుత వార్తలు వచ్చినా పార్టీ అధిష్టానం దగ్గుబాటి పురందరీశ్వరికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయన ను మరో సారి జాతీయ కార్యవర్గంలో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ కు జాతీయ కార్యవర్గంలో బాధ్యతలను అప్పగించడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Vijayasai Reddy: ‘ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పని చేయడం ఎందుకు..?’

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!