Balanced Diet Kids: మన శరీరానికి తగినంత ఆహారాన్ని ఇవ్వకపోతే అది మన మాట వినదు . ఎక్కువ తింటే ఊబ కాయం తక్కువ తింటే నీరసం. ఎనీమియా మనం ఎంత తినాలి అనేది ఈనాడు పెద్ద ప్రశ్న గా మారింది. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేద, ప్రక్రుతి వైద్యం నిపుణులు చెప్పేవన్నీ వినడం వలన మనం తినాల్సింది ఏమిటి అని మనకే సందేహం వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా చెపుతుండం వలన , సామాజిక మాధ్యమాల లో పోస్టులు , వాట్స్ అప్ మెసేజిలు ఇంకా గందరగోళానికి దారితీస్తున్నాయి. ఎవరైనా తినాల్సిన ఆహారాన్ని వారి వయసు, జీవన శైలి , వారి ఆరోగ్యం, వ్యాయామం చేసే పద్దతి లాంటి ఎన్నో విషయాల మీద ఆధార పడుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసే వాలు కొంచం ఎక్కువ తినవచ్చు. కానీ శారీరక శ్రమ చేయని వాలు సరిపడినంత మాత్రం తినాలి. మనం ఏమి తిన్నా దానిని శాస్త్రీయంగా కాలరీలలో చెప్తారు. తినే ఆహరం సమతుల్య ఆహరం అవాలి. సమతుల్య ఆహారం ఆరు ప్రధాన అంశాల నుండి సరైన నిష్పత్తిలో ఆహారాలతో ప్రారంభమవుతుంది

Balanced Diet: ఆరోగ్యవంతమైన సంపూర్ణ ఆహరం ఇలా ఉండాలి
1. ప్రోటీన్లు. ప్రోటీన్లు మన రోజువారీ తిండిలో నాలుగింట ఒక వంతు ఉండాలి. సన్నని ఎర్ర మాంసాలు, షెల్ఫిష్, పౌల్ట్రీ, గుడ్లు, గింజలు, బీన్స్, చిక్కుళ్ళు మరియు విత్తనాలు ఈ కోవకి చెందినవి.
2. పండ్లు. పండ్లు కూడా నాలుగింట ఒక వంతు ఉండాలి. ఎండిన పండ్లను, తాజా పండ్లు, ఎంచుకోవాలి. కానీ ఎండిన పండ్లు, పండ్ల రసాలలో చక్కెర ఎక్కువగా ఉంటుంది మరియు మీ ఆహారంలో ప్రధాన భాగం కాకూడదు.
3. కూరగాయలు. మీరు పండ్లను కూడా తింటే మీ కంచం లో పావువంతు కూరగాయలు ఉండాలి. లేకపోతే, అవి మీ కంచం లో సగం నింపాలి. కూరగాయలను ఎన్నుకునేటప్పుడు ఆకుకూరలు, పోట్ల, బెండ , దొండ లాంటివి అనమాట.
4. ధాన్యాలు. గింజలు మీ కంచం లో నాలుగింట ఒక వంతు వరకు అనవచ్చు. రైస్ తక్కువ తింటే మంచిది. వోట్స్, డార్క్ రై, క్వినోవా, హోల్ కార్న్ మీల్, అడవి లేదా బ్రౌన్ రైస్ లాంటివి ఉండాలి.
5. కొవ్వులు ఆరోగ్యకరమైన ఆహారమీ అయినా మోతాదులో ఉండాలి. పచ్చి ఆలివ్ నూనె లేదా పొద్దుతిరుగుడు నూనె వంటి ఆరోగ్యకరమైన అసంతృప్త నూనెలను ఎంచుకోవాలి. రోజుకు 27 గ్రాములకు పరిమితం చేయండి. ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలలో చియా విత్తనాలు, గ్రౌండ్ ఫ్లాక్స్, అవకాడో, గింజలు, గింజలు మరియు చేపలు ఉన్నాయి.
6. పాల ఉత్పత్తులు. పాల ఉత్పత్తులు బలమైన దంతాలు మరియు ఎముకలకు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. పాలు, పెరుగు, చీజ్, పన్నీరు మరియు మజ్జిగ వంటి తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత ఐటమ్స్ ఎంచుకోవాలి.
ఆకలి అవసరాలను బట్టి ఎల్లప్పుడూ సమతుల్యంగా తినడం సరైనది. నిజానికి మనం ఆనందం కోసం మరియు వారి ఆహారపు అలవాట్లను బట్టి తింటాము . ఇది సరైన విధానం కాదు. మనం ఇంట్లో గాని, బయటకు వెళ్లినప్పుడు గాని ఆకలి పుట్టించేది, ఇది మంచి వాసన, ఇది మంచి రుచి మరియు రుచిగా ఉంటుంది మరియు మన ఆర్థిక స్తొమత కు తగిన విలువ కలిగి ఉండటం కూడా మన ఆహార ఎంపికలో కీలకం.
ఇంకా కొంతమంది జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ వాటికి బానిసలూ అవుతారు ముఖ్యం గాపిల్లలు . పెద్దవాళ్లు కూడా వాళ్ళని గారాబం చేయడానికి వారితో కలిసి తింటూ ఉంటారు. దాని వలన ఊబకాయం తయారవు తుంది. మానడం మాన్పించడం ఎలా. కింది చిట్కాలు చూడండి.

Tips To Make Kids Stop Eating Junk Food: పిల్లలతో జంక్ ఫుడ్ మానిపించడానికి చిట్కాలు
1. పిల్లలతో వాదించడం కన్నా నచ్చ చెప్పడం మేలు. వీటివల్ల హానిని వివరించాలి. ఎక్కువ స్వీట్లు తింటే పళ్ళు పాడవుతాయి అని. లావుగా అవుతారని నచ్చ చెప్పాలి. అప్పుడు వాళ్లు కూడా ఆలోచిస్తారు.
2. నెమ్మదిగా వారు తినే పరిమాణాన్ని తగ్గించుకొనేలా చూడాలి. ముందు పెద్దవారు మానాలి.
3. జంక్ ఫుడ్స్ తినడం ఎంత హాని కారమో ఉదాహరణలో చెప్పాలి. ఇరుగు పొరుగు లో అల్లా అనారోగ్యం పాలైన వారిని చూపాలి.
4. మంచి ఆహార పదార్ధాలను తినేలా ప్రోత్సహించాలి. నెమ్మదిగా జంక్ ఫుడ్స్ దూరం చేయాలి.
5. సమతుల్య ఆహరం గురించి బీ ఎం ఐ ఇండెక్స్ గురించి చెప్పాలి.
6. పిల్లలు సాధారణంగా పెద్ద వాలాను అనుకరిస్తారు. కాబట్టీ పెద్దలు జాగర్తగా ఉండాలి.
7. పిల్లలను వారి కాళీ సమయం లో తల్లికి సహాయం చేయమని పంపాలి. దీని వాళ్ళ వారికి చక్కటి విలువైన సమాచారం ప్రాక్టీకల్ గా చూపించ వచ్చు.
8. పిల్లలకు ఎమితినకూడదో చెప్పినపుడు ఏమి తినాలో కూడా చెప్పాలి. రుచి తో పాటు పోషకాలుండే పదార్ధాలు పెట్టాలి.
9. మొదట్లో వారు ఉన్నపళంగా మానమంటే మానరు అందుకని నెమ్మదిగా తక్కువ గ తినేందుకు సిద్ధం చేయాలి.
పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటు పాడారు అంటే పెద్దవాళ్లదే తప్పు అవుతుంది. పిల్లలు ఏమేమి టుంటున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎంత తింటున్నారు తెలుసు కోవాలి . అది అలవాటు గా మారక ముందే జాగ్రత్త పడాలి. వారితో కలిసి విప్పతీతం గా ఐస్ క్రీమ్స్ , పీజ్ఆ లు , బర్గర్లు, కేకులు అవీ పెద్దవ్వాళ్లు కూడా తినేస్తే ఇక అంటే సంగతి. ముందు పెద్దలు జాగర్త పడితే పిల్లల్ని కంట్రోల్ చేయడం తేలిక అవుతుంది.