NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Falaknuma Train Accident: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం .. ఆరు బోగీలు దగ్ధం

Falaknuma Train Accident: హౌరా నుండి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పెను ప్రమాదం జరిగింది. తొలుత షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలు బోగీలో మంటలు అలుముకున్నాయని భావించారు కానీ కుట్ర కోణం ఉందన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ప్రయాణీకులు అందరూ అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగాడు. దీంతో ప్రయాణీకులు అందరూ హుటాహుటిన రైలు దిగి పరుగులు తీశారు. క్షణాల్లోనే రైలు నుండి దట్టమైన పొగలు అ ప్రాంతాన్ని కప్పేశాయి.

Falaknuma Train Accident:

 

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది ఆరో బోగీ దగ్గర జాయింట్ తొలగించారు. ఎస్ 1 నుండి ఎస్ 6 వరకూ బోగీలు తగులబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణీకులను తరలించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రయాణీకుల కోసం ప్రత్యేక రైలు, బస్సులు ఏర్పాటు చేస్తొంది. ఈ ప్రమాదంపై కుట్ర కోణం ఏమైనా ఉందా అన్నదానిపైనా రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చైన్ లాగిన వ్యక్తి పరిస్థితి బాగోలేదని తెలుస్తొంది. చెన్ లాగిన వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే రైల్వేసిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తొంది. చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని సమాచారం.

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను దారి మళ్లించారు. రామన్నపేట రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ ప్రెస్, నడికుడిలో రైపల్లె సికింద్రాబాద్ రైళ్లు నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపూర్ రైళ్లు విజయవాడ మీదుగా మళ్లించారు. ట్రాక్ క్లీయరెన్స్ కోసం నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ కి లభించని ఊరట .. కాంగ్రెస్, బీజేపీ స్పందనలు ఇలా

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N