NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar : టీఆర్ఎస్ నేత‌లు ఉలిక్కిప‌డే కామెంట్లు చేసిన ఈట‌ల రాజేంద‌ర్‌

Eatela Rajendar : ఈట‌ల రాజేంద‌ర్ … తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. గ‌త కొద్దికాలంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు , వార్త‌ల‌తో ఈట‌ల మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇటీవ‌ల సీఎం పేరు లో కూడా ఆయ‌న ప్ర‌స్తావ‌న‌ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే టీఆర్ఎస్ పార్టీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోయే కామెంట్లు చేశారు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ . టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇచ్చే గుర్తింపు కార్డును చూపిస్తే పోలీసులు కూడా అడ్డుచెప్పరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

minister-eatela-rajendar-sesnational-comments
minister-eatela-rajendar-sesnational-comments

Eatela Rajendar  ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌నం…

త‌న సొంత ఇలాకా అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీ స‌భ్య‌త్వ కార్య‌క్రమంలో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈట‌ల మాట్లాడుతూ, లక్ష సభ్యత్వాలకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ పార్టీ సభ్యత్వాల కోసం బాగా కష్టపడేవారికి ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఎక్కడైనా ఏ నాయకుడైనా అండగా ఉంటారని ఈటల భ‌రోసా ఇచ్చారు. ఇదే సంద‌ర్భంగా పార్టీ గుర్తింపు కార్డులు ఉంటే పోలీసులు అడ్డుచెప్ప‌రు అంటూ మంత్రి ఈటల రాజేందర్ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

సీఎం రేసులో ఈట‌ల‌?

తెలంగాణ సీఎం మార్పు… నూత‌న ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ కు చాన్స్‌ అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. వరుసగా సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. తానే సీఎంగా ఉంటానని నేతలకు కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే మ‌రోవైపు నుంచి సీఎం ప‌ద‌వికి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ పేరు ప్ర‌తిపాదించ‌బ‌డింది. టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ కు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి లేదని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కొత్త బాంబ్ పేల్చారు. అయితే, టీఆర్ఎస్ పార్టీలో సీఎం పీఠం చ‌ర్చ‌కు పార్టీ ర‌థ‌సార‌థి ఫుల్ స్టాప్ పెడితే మ‌రోపార్టీ మాత్రం దాన్ని కొసాగించ‌డం గ‌మ‌నార్హం అయితే, ఈట‌ల రాజేంద‌ర్ సైతం టీఆర్ఎస్ నేత‌లు ఆశ్చ‌ర్య‌పోయే కామెంట్లు చేయ‌డం మ‌రింత విశేషం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N