NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: ముగిసిన నామినేషన్ల పర్వం .. చివరి రోజు నామినేషన్ లు దాఖలు చేసిన ప్రముఖులు వీరే

Share

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ దాఖలునకు శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నాయకులు తమ నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు సమర్పించడంతో రిటర్నింగ్ కార్యాలయాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం 3 గంటల లోపు ఆర్ఓ కార్యాలయం లోపలకు వచ్చి వారందరి నామినేషన్లను అధికారులు స్వీకరించారు.

కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ పై పోటీకి దిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్య, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్ పాల్గొన్నారు. ఈ సారి ఎన్నికలు హోరాహోరీ గా జరుగుతున్నాయి. కీలక అభ్యర్ధులపై పోటీకి సమ ఉజ్జీలు పోటీ పడుతున్నారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ లో, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో, మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హూజూరాబాద్ లో నామినేషన్లు దాఖలు చేశారు.  భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు, వేములవాడలో బీజేపీ అభ్యర్ధిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, సంగారెడ్డి బీజేపీ అభ్యర్ధిగా రాజు తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో నిలిచేందుకు సిద్దమై నామినేషన్లు వేశారు.

ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది. 15వ తేదీ బరిలో ఉన్నఅభ్యర్ధుల లిస్ట్ ప్రకటిస్తారు. నామినేషన్ల సమయంలో వంద మందికిపైగా అభ్యర్ధులు అఫిడవిట్ లు సమర్పించలేదని సమాచారం. వారికి రిటర్నింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 2,399 నామినేషన్లు దాఖలు కాగా అందులో 456 రిజెక్ట్ అయ్యాయి. మరో 367 నామినేషన్లు అభ్యర్ధులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1821 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఈసారి నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం వరకే 2,474 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం వెయ్యికిపైగా నామినేషన్లు దాఖలై ఉంటాయని సమాచారం.

Telangana Election: సంగారెడ్డి సీన్ వేములవాడ బీజేపీలోనూ.. టికెట్ ఖరారు ఒకరికి.. బీఫామ్ మరొకరికి..అధిష్టానంపై తుల ఉమ ఫైర్


Share

Related posts

జెసికి జగన్ సర్కార్ మళ్లీ షాక్:ట్రావెల్స్ బస్సులు సీజ్

somaraju sharma

Liger : లైగర్ మీదే ఇండస్ట్రీ చూపు.. పూరి జగన్నాధ్ క్రేజ్ అది మరి..!

GRK

Daily Horoscope జూలై 23 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha