Revanth Reddy: తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపునకు నిరుద్యోగ యువత కూడా ఒక ప్రధాన కారణం అని అందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న స్లోగన్ తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కేసిఆర్ సర్కార్ ..ప్రభుత్వంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయింది. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ .. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చింది. నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ లో ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన గ్యారెంటీ (హామీ)ని నెరవేర్చబోతున్నారు.
హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు) రజిని పీజీ పూర్తి చేసింది. అటు ప్రైవేటులో, ఇటు ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని ఈ ఏడాది అక్టోబర్ నెలలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. రజనీ అవేదనను సావధానంగా విన్న రేవంత్ రెడ్డి ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్, ఖర్గే వస్తారని చెప్పిన రేవంత్.. అదే రోజున వారి సమక్షంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం ఇస్తుందని రజిని హామీ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు అని రేవంత్ రాసి ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి ఆమెకు ఉద్యోగం ఇవ్వబోతున్నారు.
ఈ వేళ మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు రజినికి తొలి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. రేవంత్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రజినికి అహ్వానం కూడా పంపించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి అహ్వానం రావడంతో పాటు ఉద్యోగం కూడా వస్తుండటంతో రజిని, ఆమె కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు అనేక హామీలను ఇస్తూ ఉంటారనీ, ఎన్నికలు అయిన తర్వాత వాటిని మరచిపోతుంటారని, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగం ఇస్తుండటంతో రేవంత్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని రుజువు అవుతోందన్న కామెంట్స్ వస్తున్నాయి.
CM YS Jagan: విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి .. భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్