NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: సీఎం కేసిఆర్ హెలికాఫ్టర్ లో మరో సారి సాంకేతిక లోపం

Share

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు సుడి గాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ హెలికాఫ్టర్ లో పర్యటిస్తూ నిత్యం రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. సోమవారం కేసిఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ అప్రమత్తమైయ్యాడు. దీంతో కేసిఆర్ కు తృటిలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా కొమరంభీమ్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసిఆర్ హెలికాఫ్టర్ కు సాంకేతిక లోపం తలెత్తింది. సిర్పూర్ లో హెలికాఫ్టర్ టెకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్ ను నిలిపివేశారు. దీంతో కేసిఆర్ రోడ్డు మార్గాన అసిఫాబాద్ బయలుదేరారు. కాగా సీఎం కేసిఆర్ ఇవేళ ఉమ్మడి అదిలాబాద్ లో పర్యటిస్తున్నారు. సిర్ఫూర్ లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం అసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు.

రెండు రోజుల క్రితం సోమవారం నాడు సీఎం కేసిఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ లో బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ టేకాఫ్ అయన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత అధికారులు వేరే హెలికాఫ్టర్ ను ఏర్పాటు చేయగా, అందులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

Chandrababu: ఇసుక కేసులోనూ చంద్రబాబుకు ఊరట


Share

Related posts

బిగ్ బాస్ 4: కొత్త కెప్టెన్ అవినాష్ కొత్త రూల్స్..!!

sekhar

YS Jagan: అయ్యో.. సీఎం గారూ! మాట తప్పుతున్నారేమో..! ఆ బిరుదు పోతుందేమో..!?

Srinivas Manem

దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న రేణుదేశాయ్..!!

sekhar