NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana: తెలంగాణ ఎన్నికల సమయం లో పార్టీలు మార్చిన రాజకీయ నేతలు వీరే!

Telangana Defection 2023: These are the leaders who changes political parties in Telangana before elections
Share

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో నాయకులు పార్టీలు మారిపోతున్నారు. దీనికి రకరకాల కారణాలు… కొందరు తమ పార్టీ లో టికెట్ రాకపోతే వేరే పార్టీ లోకి అలవోకగా దూకుతున్నారు. కొందరు వారు అడిగిన చోట టికెట్ రాక మారుతున్నారు. ఇంకొందరు గెలిచే పార్టీ ని ఎన్నుకుని ఆ పార్టీ లోకి మారు తున్నారు. ఇలా పార్టీలు మార్చిన నాయకుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాము.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి మారిన వారు ఎవరంటే… ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి రాహుల్ సమక్షం లో కాంగ్రెస్ లో జేరిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , వేముల వీరేశమ్ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జూపల్లి కృష్ణ రావు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, పాణ్యం వెంక టేశ్వర్లు , కోరం కనకయ్య లు జూన్ లోనే కాంగ్రెస్ లోకి వెళ్లారు.

కొన్ని చోట్ల చిత్ర మైన పరిస్థితి ఉంది. నరికేల్ లో 2018 లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య , తర్వాత బీ ఆర్ ఎస్ లో చేరారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తుండగా , ఇదివరలో బీఆరఎస్ నుండి పోటీ చేసిన వేముల వీరేశం ఇపుడు అదే నరికేల్ నుండి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు .

ఇల్లేందు లో బానోతు హరిప్రియ కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. ఆమె తో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య ఇపుడు కాంగ్రెస్ నుండి ఇల్లేందు బరిలో ఉన్నారు.

పాలేరు లో 2018 లో కాంగ్రెస్ నుండి గెలిచిన కే ఉపేంద్ర రెడ్డి బీఆర్ఎస్ నుండి బరిలో ఉన్నారు. ఆయన పై ఓడిన తుమ్మల కాంగ్రెస్ నుండి ఖమ్మం బరిలో దిగుతున్నారు.
బోధ్ లో 2018 లో బాపురావు బీఆర్ఎస్ నుండి గెలిచి ఈసారి టికెట్ రాక కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఆయన పై ఓడిన అనిల్ కి బీఆర్ఎస్ టికెట్ వచ్చింది.

ఇక కాంగ్రెస్ లోని అసమ్మతులు బీఆర్ఎస్ లోకి దూకుతున్నారు. అందులో ముఖ్యంగా మాజీ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పొన్నాల లక్మయ్య ఉండడం విశేషము. తనను కాంగ్రెస్ అవమానించిందని , ప్రస్తుత నాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని పొన్నాల చెప్పారు.
తెలుగు దేశం తెలంగాణ కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లోకి వెళతారని అంటున్నారు. కోమటి రెడ్డి రాజగోపాలం రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి వొచ్చేసారు. ఎన్నికలు దగ్గిర పడిన కొద్దీ పార్టీ మార్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయేమో వేచి చూడాలి.

 


Share

Related posts

Rakul preeth singh: రాక్షసుడు హిందీ రీమేక్‌లో అక్షయ్‌కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్

GRK

plants: అశ్వని ,భరణి ,కృత్తిక,రోహిణి,మృగశిర,ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఈ మొక్కలు పెంచండి!!

siddhu

careplex vitals app: పల్స్ ఆక్సీమీటర్ అక్కర్లేదు..! ఇక స్మార్ట్ ఫోన్‌లోనే ఆక్సిజన్ లెవల్స్ చూసుకోవచ్చు..! అదెలానో చూడండి..!!

somaraju sharma