NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల .. మొత్తం ఓటర్లు 4,02,21,450.. అభ్యంతరాల స్వీకరణ ఎప్పటి వరకు అంటే..?

Share

ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ తొమ్మిదో తేదీలోపు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఈసీ ప్రకటనలో పేర్కొంది. ఏపీలో మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా, ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 మంది ఓటర్లు ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.

జాబితా ఇదే..

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు – 4,02,21,450, మహిళా ఓటర్లు – 2,03,85,851, పురుష ఓటర్లు – 1,98,31,791, సర్వీసు ఓటర్లు 68,158, ట్రాన్స్ జెండర్లు – 3,808, ఇక, ముసాయిదా జాబితాలోని అభ్యంతరాల స్వీకరణకు ఆఖరి తేదీ డిసెంబర్ 9వ తేదీగా ఈసీ ప్రకటించింది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. 2022 జనవరి 6 నుండి 2023 ఆగస్టు 30 వరకూ అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ తెలిపింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్లు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది.

Telangana Assembly Polls: బీజేపీ రెండో జాబితా విడుదల .. ఆశావహుల్లో నిట్టూర్పు..ఎందుకంటే..?


Share

Related posts

ఈ విషయంలో మహేష్ బాబే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..??

sekhar

Balakrishna : బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది ..!

GRK

Rashmika mandanna: మాస్‌ను అట్రాక్ట్ చేస్తున్న రష్మిక మందన్న సిగ్నేచర్ స్టెప్..

GRK