Breaking: మెదక్ జిల్లా తుఫ్రాన్ లో శిక్షణ విమానం కూలిపోయింది. అయితే, హెలికాఫ్టర్ కూలిపోయిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం లో శిక్షణలో ఉన్న పైలట్ మృతి చెందినట్లు సమాచారం.
హైదరాబాద్ కు చెందిన హెలికాఫ్టర్ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ పరిధిలో రావెల్లి శివారులో కూలిపోయింది. భారీ శబ్దం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కూలిన శిక్షణ హెలికాఫ్టర్ లో మంటలు చెలరేగడంతో ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఎయిర్ ఫోర్స్ క్లూస్ టీమ్ చేరుకుని పరిశీలన చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.