NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 04 2023 Episode 1116: గుడిలో అనుని చుసిన ఆర్య, అను ఆర్యలని చంపడానికి రౌడీలని పెట్టిన మానస..

Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights

Prema Entha Madhuram December 04 2023 Episode 1116: ఆర్య అను కోసం గుడి దగ్గరికి వస్తాడు. గుడి చుట్టూ అను ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు. ఈశ్వర ఈరోజు ఎలాగైనా అను నాకు దొరకాలి ఒక్కసారి నా కంటపడితే తను నేను బ్రతికి ఉన్నంతవరకు తన చేయి వదిలిపెట్టను అని ఆర్య ఈశ్వరుడికి నమస్కారం చేసుకుంటాడు.బయట అను దర్వాజకి పసుపు కుంకుమ పెట్టి దీపం పెట్టి ముందుకు వెళుతుంది. ఆర్య లోపలికి రాబోతుండగా అక్కడ ఒక ఆవిడ జారి పడబోతే పట్టుకుంటాడు. చూసుకోండమ్మ కింద పడిపోతారు అని ఆర్య అంటాడు. ఉపవాసం ఉన్నాను కదా బాబు కళ్ళు తిరిగి అలా పడిపోయినట్టు అనిపించింది మరేం పర్వాలేదు నేను వెళ్లగలను అని ఆవిడ అంటుంది. జాగ్రత్తగా వెళ్లండి అమ్మ అని ఆర్య అంటాడు. అను అక్కడ కూడా దీపం పెట్టి ముందుకు వెళుతుంది. అను కోసం ఆర్య వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా కింద ఒక కొబ్బరి చిప్ప ముక్క కాలి కింద పడి కాలుకు గాయం అవుతుంది. కొబ్బరి చిప్ప తీసుకొని అడుగు ముందుకు వేయబోతూ ఉండగా ఆర్య కింద పడబోతాడు.

Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights
Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights

ఆర్య కింద పడబోతు ఉండగా శివయ్య రూపంలో ఒక చిన్నపిల్ల వాడు ఆర్యని పట్టుకుంటాడు. ఆ పిల్లవాడిని చూసి ఆర్య ఆశ్చర్యపోతాడు. గాయం బాగా అయింది రక్తం పోతుంది రా నేను గాయానికి మందు పెడతాను అని ఆ పిల్లవాడు తన చేయి పట్టుకొని తీసుకువెళ్లి ఒక చోట కూర్చో పెడతాడు. ఎవరు నువ్వు అని ఆర్య అడుగుతాడు. శివయ్యని అని ఆ అబ్బాయి అంటాడు. నువ్వు వేసుకున్న వేషాన్ని కాదు నేను అడిగింది నీ పేరేంటి అని ఆర్య అంటాడు. నా వేషం చూసి నువ్వు అలా అడుగుతున్నావు కానీ ఇది నా వేషం కాదు నా రూపమే ఇలా ఉంటుంది నేను శివయ్యను అని చెప్పినా ఎవరూ నమ్మరు ఎందుకంటే మనుషులు వేసుకునే వేషధారణను బట్టి నువ్వు ఎవరు అని అడుగుతారు అది మనుషుల సహజ లక్షణం అని అబ్బాయి అంటాడు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావే చిన్నపిల్లవాడివి అయినా అని ఆర్య అంటాడు. నా మాటలు నీకు విచిత్రంగానే ఉండొచ్చు కానీ నాకు ఏ పేరు లేదు రకరకాల పేర్లతో పిలుస్తారు రకరకాల రూపాలతో కొలుస్తారు కానీ నేనే భగవంతుడిని అంటే ఎవరూ నమ్మరు ఇక్కడే కూర్చో నేను వెళ్లి నీ గాయానికి మందు తెస్తాను అని ఆ అబ్బాయి అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights
Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights

వెళ్ళిపోతూ ఆ అబ్బాయి మళ్ళీ అంటాడు నువ్వు వెతుకుతున్న బంధం దొరుకుతుంది కానీ ఆ బంధాలు ఎక్కువ రోజులు ఉండేవి కావు మనుషులు భూమ్మీద కొంతకాలమే బ్రతుకుతారు అవేవీ శాశ్వతం కావు ముందు నువ్వు అది తెలుసుకో అని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,అను శివాలయంలో శివుడికి భస్మ పూజ చేస్తూ ఉంటుంది. అబ్బాయి అక్కడికి వెళ్లి కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమ్మ అని అంటాడు. ఏ చిన్న పసుపు కుంకుమలు ఇవ్వకూడదు అని అను అంటుంది. నీ పసుపు కుంకుమలు కాపాడడం కోసమే అంటూ ఆ పిల్లవాడు పసుపు తీసుకొని వెళ్ళిపోతాడు. చిన్న అలా తీసుకు వెళ్ళకూడదు నాన్న అని అను అంటుంది.ఆ పిల్లవాడు పసుపు తీసుకువెళ్లి ఆర్యకి ఇచ్చి ఇది నీ గాయం దగ్గర పెట్టుకో తగ్గిపోతుంది నీకు కావాల్సింది దేవుడిని అడుగు అని వెళ్ళిపోతాడు.ఆ అబ్బాయి అన్నమాటలు ఆర్య గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే, మానస రౌడీలకి ఫోన్ చేసి గుళ్లోకి వెళ్లారా మీరు చంపవలసిన వాళ్ళు గుళ్లోనే ఉన్నారు క్లారిటీగా చూసుకోండి అని చెప్తుంది. ఓకే మేడం మీరేం టెన్షన్ పడకండి వాళ్ళని ఏసేసాక మీకు ఫోన్ చేస్తాను అని రౌడీలు అంటారు.

Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights
Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights

జాగ్రత్తగా మేనేజ్ చేయండి ఈసారి మిస్ అవ్వకూడదు అని ఛాయా అంటుంది.ఛాయా రౌడీల కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే ఈరోజు ఎలాగైనా ఆర్య అనులా చావు ఖాయం అనుకుంటా అని మానస అంటుంది. కట్ చేస్తే, పూజ అనంతరం నక్షత్ర హారతి ఇవ్వు అని పంతులుగారు అంటాడు. అను శివయ్యకి నక్షత్ర హారతి ఇస్తుంది. అక్కడ పూజ అయిపోయిన తరువాత కోనేటి దగ్గరికి వెళ్లి అను దీపాలను వెలిగిస్తూ ఉంటుంది. ఆర్య అను కోసం వెతుకుతూ ఉండగా పూజారి గారు కలిసి బాబు మీ భార్య దొరికిందా అని అంటాడు. లేదు పంతులుగారు వెతుకుతున్నాను ఇంకా కనిపించలేదు అని అంటాడు. సీసీ కెమెరాలో ఎక్కడ ఉందో చూడు బాబు అని పూజారి అంటాడు. ఆర్య సిసి టీవీ ఫుటేజీని చూస్తాడు. అందులో అను కోనేటి దగ్గర దీపాలను వదులుతూ కనిపిస్తుంది. అను కనిపించగానే ఆర్యా సంతోషంతో పొంగిపోయి అను దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు. అక్కడికి వెళ్లి అను అని గట్టిగా అరుస్తాడు. ఆర్య ని చూసిన అను అమ్మో ఈయన చూసేసాడు ఈయనకు దొరకకూడదు అని తప్పించుకొని పారిపోతుంది. ఆ జనం మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చే సరికి అను వెళ్లి దాచుకుంటుంది. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి ఉండదు అను ఎక్కడికి వెళ్ళిపోయావు నా ప్రాణాలు ఏదైనా జరుగుతుందనే కదా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావ్, నాకు ఏమీ కాదు అను అవన్నీ అబద్దం నువ్వు నా దగ్గరికి రా అని అంటూ ఆర్య వెతుకుతూ ఉంటాడు.

Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights
Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights

అను స్తంభం చాటుకు నిలబడి ఆర్యని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే, ఇంటిదగ్గర ఛాయా మానస టెన్షన్ పడుతూ ఉంటారు.ఏంటి మానస ఇంకా ఫోన్ రాలేదు రౌడీలు ఆర్యని చంపేసి ఉంటారా అసలు ఏం జరుగుతుంది అక్కడ అని ఛాయా అంటుంది. చూడు ఛాయా రౌడీల కాన్ఫిడెన్స్ చూస్తుంటే అనుని ఆర్యని వేసేసి మనకి ఫోన్ చేస్తారు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావ్,వాళ్లు ఆర్యని అనుని వెతికే పనిలో ఉండుంటారు కొద్దిసేపు వెయిట్ చేద్దాం వాళ్లే ఫోన్ చేస్తారు అని మానస అంటుంది. నాకు వాళ్ళని చంపేస్తారా లేదా అని టెన్షన్ మొదలైంది మానస ఈరోజు మిస్ అయితే మనకు మళ్ళీ వాళ్ళు దొరకరు,అన్నయ్యని నేను బయటికి రప్పించుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం వాళ్ళని ఎలాగైనా సరే ఈరోజు చంపి తీరాలి రౌడీలు అని  చాయా అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights
Prema Entha Madhuram Today Episode December 04 2023 Episode 1116 Highlights

ఛాయా నువ్వు అంత డీప్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు రౌడీలు కచ్చితంగా వేసేస్తారు అని మానస అంటుంది. కట్ చేస్తే,అనుకోసం ఆర్య వెతుకుతూ ఉంటాడు. ఎందుకు అను నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు ఈరోజు నేను ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాను నువ్వు నాకు ఇంకా దూరమైతే తట్టుకోలేను అని ఆర్య బాధ పడుకుంటూ గుడి అంతా వెతుకుతూ ఉంటాడు.నన్ను క్షమించండి సార్ నేను మీ కంటపడలేను మీకేమైనా అయితే నేను భరించలేను అని అను అనుకుంటుంది. రౌడీలు ఆర్య కోసం అను కోసం తీవ్రంగా గాలిస్తూ ఉంటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N