NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS MLA Vanama: తన కుమారుడు రాఘవపై సొంత పార్టీ వాళ్లే కుట్ర చేశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా సంచలన కామెంట్స్

TRS MLA Vanama comments on raghava case

TRS MLA Vanama: ఖమ్మం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ 61 రోజుల పాటు జైలులో ఉంటి ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు. తన కుమారుడు రాఘవపై కేసు నమోదు అయిన సమయంలో పోలీసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే రెండు నెలల తరువాత ఈ కేసు విషయంపై ఎమ్మెల్యే వనమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

TRS MLA Vanama comments on raghava case
TRS MLA Vanama comments on raghava case

TRS MLA Vanama: కుట్రదారుల బండారాన్ని బయటపెడతా

శనివారం అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడారు. రెండు నెలల పాటు తాను అనారోగ్యంతో బాధపడ్డాననీ, తాను లేని సమయంలో తన కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కుమారుడి భవిష్యత్తు నాశనం చేశారని మండిపడ్డారు. తాను ఆరోగ్యంతో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. నియోజకవర్గంలో తాను నిత్యం పర్యటిస్తున్నాననీ, తన కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారాన్ని త్వరలో బట్టబయలు చేస్తానని చెప్పారు. తన కుమారుడిపై కుట్ర వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీల వారు కూడా కుమ్మక్కు అయ్యారని వనమా ఆరోపణలు గుప్పించారు.

 

నాడు ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణ కారులో దొరికిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలతో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవ పాత్ర వెలుగులోకి వచ్చింది. రాఘవకు వ్యతిరేకంగా సాక్షాలు వెలుగుచూడటంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు నేపథ్యంలో రాఘవను టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?