Abhishekam serial March 19th: ఈటీవీలో ఒకప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ అభిషేకం. ఈ సీరియల్లో నటించిన సుభద్ర కూడా మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు వందన. జనవరి 1న వందన కాకినాడలో జన్మించింది. పుట్టింది కాకినాడ అయినప్పటికీ పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే. ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి.
ఈమెకి ఓ చెల్లి మరియు తమ్ముడు కూడా ఉన్నారు. ఇక చదువు విషయానికి వస్తే.. ఈమె ఇంటర్ వరకు హైదరాబాదులో చదువుకుంది. అనంతరం ఊటీలో బీఫార్మసీని కంప్లీట్ చేసింది. ఎడ్యుకేషన్ పూర్తి కాగానే వందన ఉద్యోగం కూడా చేసింది. ఇక అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళ లో కంటిస్టెంట్ గా పాల్గొంది. అంతేకాకుండా విన్నర్ గా టైటిల్ సైతం గెలుచుకుంది.
అలా మొట్టమొదటిసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అనంతరం ఈమెకి ఈటీవీలో యాంకరింగ్ చేసే అవకాశం కూడా దక్కింది. మూవీ మిర్చి అనే ఓషో కి ఈమె యాంకరింగ్ చేసింది. అనంతరం సీరియల్ ఆఫర్స్ రావడంతో ఈటీవీలో ప్రసారమైన భార్యామణి సీరియల్ తో వందన బుల్లితెర సీరియల్స్ కి పరిచయమైంది. మొదటి సీరియల్ తోనే ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది.
ఇక అంతపురం, భార్య, సీతాకోకచిలుక, గుండమ్మ కథ, అక్క మొగుడు, ఎవరే నువ్వు మోహిని, స్వాతి చినుకులు వంటి పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్స్ విషయానికి వస్తే.. ఈమెకి మ్యారేజ్ అయింది. భర్త పేరు చంద్రశేఖర్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప ఒక బాబు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో కొంచెం జోరు తగ్గించింది. మరి రానున్న రోజుల్లో మునుపట్టి లాగా తన జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!