ప్రముఖ ఛానల్ అయిన స్టార్ మా లో భారీ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం నవవసంతం. ఈ సీరియల్ మొదటి భాగం ఎంత పెద్ద విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక ఇదే దృష్టిలో పెట్టుకుని ఈ సీరియల్ కి సీక్వెల్ గా కార్తీకదీపం నవవసంతం అనే పేరుతో మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మేకర్స్. ఇక ఈ సీరియల్లో ప్రేమీ విశ్వనాథ్ దీప క్యారెక్టర్ లో నటిస్తూ తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. అలా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బుల్లితెర స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈమె ఓ మలయాల్ నటి.
ఇక ఇప్పుడు కార్తీకదీపం నవవసంతంతో మరోసారి అలరించేందుకు వచ్చేసింది దీప. ఇక ప్రేమి విశ్వనాథ్ సొంత ఊరు కేరళ. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె కేవలం తన ప్రొఫెషనల్ విషయాలను మాత్రమే షేర్ చేసుకునేది. తన పర్సనల్ లైఫ్ గురించి అసలు బయట పెట్టేది కాదు. ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు దిలీప్ బట్. ఈయన ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్. ఇక ఈయన తెలుగులో ఒకటి రెండు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఈయనకి తెలుగులో సైతం మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దీప ఇతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక ప్రస్తుతానికి అయితే వీరి దాంపత్య జీవితం బాగానే కొనసాగుతుంది. ఇక ఈ కపుల్ కి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. తన పేరు మనుజిత్. ఇక మొదటిసారి ప్రేమి విశ్వనాథ్ తన సోషల్ మీడియా వేదికగా తన కొడుకు మంజూత్ తో ఉన్న కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. దానికి మై సన్ అండ్ స్వీట్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ప్రేమి విశ్వనాధ్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింటి వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ని చూసిన పలువురు..” మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడు అంటే అసలు నమ్మశక్యం కావడం లేదు. ఇప్పటివరకు మీకు పిల్లలు లేరు అని అనుకున్నాం. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద కొడుకును చూపించి సర్ప్రైజ్ చేశారు.
అంత పెద్ద కొడుకు ఉన్న ఇంకా ఇంత యంగ్ గా పనిచేస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్. అయినా ఇన్ని సంవత్సరాల్లో ఒకసారి కాకపోతే ఒకసారి కూడా మీ కొడుకుని ప్రేక్షకులకు ఎందుకు పరిచయం చేయలేదు? ఇప్పుడు ఎందుకు కెమెరా ముందుకు తీసుకొచ్చారు? అయినా మీరు మీ సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫెషనల్ లైఫ్ గురించి తప్ప పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు షేర్ చేయరు? మీకన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్నవారు ఉన్నారు కానీ వారందరూ తమ ఫ్యామిలీ పిక్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం అసలు షేర్ చేయరు. దీనికి కారణం ఏంటో మాకు అర్థం కావడం లేదు ” అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు ప్రేక్షకులు.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!