16.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Telugu TV Serials

అసలు నువ్వా నా భార్యవి…. ఆ వంటలక్కా అని మోనితను నిలదీసిన కార్తీక్.!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1462వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 21న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం..కార్తీకదీపం సీరియల్‌లో ప్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో దీప కార్తీక్‌ని గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే కార్తీక్ కళ్లు తిరిగిపడిపోతే మోనిత వచ్చి కార్తీక్‌ని తీసుకుని వెళ్లిపోతుంది.అలాగే కార్తీక్ మన బాబు పేరు ఏంటి అని మోనితను అడగడంతో ఆనంద్ అని మోనిత చెప్తుంది. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అని కార్తీక్ అనడంతో మోనిత షాక్ అవుతుంది.ఈ క్రమంలోనే నేటి కథనం ఎంతో ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి.కార్తీక్ అలా అనగానే మోనిత మన బాబు పేరే.. చిన్నప్పటి నుంచి మనం చాలా సార్లు పిలవడం వలన నీకు అలా అనిపిస్తుంది అంతే అంటూ నవ్వుతూ కవర్ చేసేస్తుంది. అదే అయ్యి ఉంటుందిలే అంటూ కార్తీక్‌ బాబుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

దీప -మోనితల మధ్య మాటల యుద్ధం :కొద్దిసేపు అయ్యాక దీప మోనిత ఇంట్లోకి వెళ్లబోతుంటే అక్కడే ఉన్న మోనిత దీపకు అడ్డుగా వచ్చి ఆగవే అని అరుస్తుంది. ‘ఏంటి అత్తారింటికి వెళ్లినట్లు వెళ్లిపోతున్నావ్? రావద్దు అని చెప్పినా సిగ్గులాదా నీకు? ఎందుకే నా కాపురానికి శనిలా దాపరించావ్? అంటూ రెచ్చిపోతుంది మోనిత.ఇక దీప కూడా కోపంతో ఎక్కువ మాట్లాడితే ఈ గడప కిందే పాతరేస్తాను ఏం అనుకున్నావో అని అరుస్తుంది.కాపురం అంటున్నవ్ కదా ఏది కాపురం తాళి కట్టిన భర్తతో చేసేదాన్ని కాపురం అంటారు.. ఇలా పరాయి ఆడదాని భర్తని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం అంటారో? ఊరిలో వాళ్లని అడుగు చెప్తారు అంటూ తిడుతుంది అంటుంది దీప.అయినా నీ బాగోతం అంతా ఆయనకు గతం గుర్తుకు వచ్చేవరకే కదా అంటుంది. కార్తీక్ కు గతం గుర్తుకు రాదు. రానివ్వను.. నా కొడుకుని తెచ్చి కార్తీక్ చేతిలో పెట్టా ఇంకేమి కావాలి అంటుంది. దీప మాత్రం బాబుని చూడగానే నేను అదే భయపడ్డాను. కానీ నాకు నమ్మకం వచ్చింది. డాక్టర్ బాబు పక్కనే ఉండటానికి నన్ను ఎలాగో రానివ్వవు.కానీ బాబు నిత్యం ఆయన దగ్గరే ఉంటాడు. బాబుతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొచ్చినా చాలు.అందులో నేను ఉంటాను అదే జరుగుతుంది అంటూ డాక్టర్ బాబును పిలుస్తుంది. ఇంతలోనే కార్తీక్ బాబుని తీసుకుని బయటికి వస్తాడు.డాక్టర్ బాబు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగి బాబుతో గడిపిన జ్ఞాపకాలు చాలా ప్రత్యేకంగా ఉండి ఉంటాయి. వీడితో ఆడుకుంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి.. అన్నీ గుర్తొచ్చేస్తాయి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

నా భార్య నువ్వా… ఆ వంటలక్కా అంటున్న కార్తీక్ :కాసేపటికి కార్తీక్ బయటికి వెళ్లి తిరిగి రావడం చూసిన మోనిత ఎక్కడికి వెళ్లావ్ కార్తీక్’ అంటుంది. ‘శివతో కలిసి బయటికి వెళ్లాను అంటే అది కనిపించిందా?’ అంటుంది మోనిత ముఖం కోపంగా పెట్టి.మోనితా ప్రవర్తన చూసి కోపంతో ఒకే ఒక్క ప్రశ్నవేస్తాను.. నువ్వు బాధపడినా సరే అడుగుతాను సమాధానం చెబుతావా’ అంటాడు కార్తీక్. ‘ఏంటి కార్తీక్’ అని దీప అనగానే.. ‘నా భార్యవి నువ్వా? ఆ వంటలక్కా?’ అంటాడు కార్తీక్. నాకేమో ఏం గుర్తులేదు. నువ్వు చెప్పావనే కదా నువ్వు నా భార్యవని నమ్మాను. మనం ఇక్కడికి వచ్చిన మొదట్లో బాగున్నావ్. ఎప్పుడైతే ఆ వంటలక్క వచ్చిందో మొత్తం మారిపోయింది. ఎందుకు ఆ వంటలక్కని చూస్తే నీకు భయం అని నిలదీస్తాడు. దాంతో మోనిత వెంటనే ఏడుపు అందుకుంటుంది. కార్తీక్.. నీకోసం నేను ఎన్ని చేసాను.నీ మాటలు నన్ను ఎంత బాధిస్తాయి అని కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నావ్ అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

డాక్టర్ అన్నయ్యతో తన బాధను చెప్పుకుంటున్న దీప :

మరోవైపు దీప వాళ్ల అన్నయ్యకు జరిగిన విషయం చెబుతుంది.దాంతో అతడు అమ్మా దీపా మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డాక్టర్ బాబుని ఒకసారి ఆసుపత్రికి తీసుకుని వస్తే గాని అన్ని టెస్ట్‌లు చేసి ఈ విషయం చెప్పడానికి కుదురుతుంది అంటాడు.సరే అన్నయ్యా డాక్టర్ బాబుని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాను అంటుంది దీప.

కార్తీక్ ను తీసుకుని వెళ్లిపోతున్న మోనిత :

ఇక మరునాడు ఉదయాన్నే మోనిత బట్టలు సద్దుతూ ఉంటుంది. కార్తీక్ మోనిత గదికి వెళ్లి ‘ఎక్కడికి మోనితా? అంటే మనం ఊరు వెళ్తున్నాం కార్తీక్..ఈ అవమానాలు నాకు అవసరమా? పదా.. అక్కడికి వెళ్తే నీకు అంతా గుర్తొస్తుంది. నేనిక నీ అనుమానాలు భరించలేను అని కొత్త నాటకం మొదలుపెడుతుంది.అది కాదు మోనితా నార్మల్‌గా అడిగానంతే ఇప్పుడు ఎక్కడికీ వద్దులే’ అంటాడు కార్తీక్. ‘లేదు మనం వెళ్లాల్సిందే’ అంటుంది మోనిత.
సరే అయితే నువ్వు రాత్రి నుంచి ఏం తినలేదు కదా ఏదన్నా తినేసి బయలుదేరదాం’ అంటాడు కార్తీక్.

మోనిత మరొక ప్లాన్ :ఇక ఇంతలో శివ పరుగున దీప దగ్గరకు వెళ్లి అక్కా మేడమ్, సార్‌ని, బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్తోంది. నన్ను రావద్దు అని చెప్పారు అని అంటాడు.ఇక దీప కంగారుగా ఎక్కడికో తెలుసుకో తమ్ముడు’ అంటుంది. మళ్ళీ శివ మోనిత దగ్గరకు వచ్చి మేడమ్ మీరు చెప్పమన్నట్లే ఆ వంటలక్కకు చెప్పాను’ అంటాడు. ‘గుడ్.. ఏమంది?’ అంటుంది మోనిత.చాలా కంగారు పడింది మేడమ్.. ఎక్కడికో కనుక్కో అంది’ అంటాడు శివ. అంటే మోనిత ఇంకేదో ప్లాన్ వేస్తుంది అని అర్ధం అవుతుంది

    
Share

Related posts

మాధవ్ రాధ కి ఫ్యుజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చాడుగా.. ఆదిత్యకు దేవి శాశ్వతంగా దూరం కానుందా.!?

bharani jella

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

bharani jella

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ ఏంటి ఇలా వచ్చింది..!?

bharani jella