Magwa o magva serial March 9th: ప్రస్తుతం సీరియల్స్ ట్రెండ్ ఏ విధంగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. సినిమాల అయినా వదులుకుంటారేమో కానీ సీరియల్స్ ని మాత్రం ఒక్కరోజు కూడా పోనివ్వరు. ప్రతిరోజు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో ఆ సీరియల్ వీక్షిస్తారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు అనేక టీవీ చానల్స్ వారు.
Also Read: https://newsorbit.com/news/movies/heroine-of-student-web-series-checking-social-media.html
ఇక సీరియల్స్ కి పెట్టిన పేరు స్టార్ మా. మంచి కాన్సెప్ట్‌లను జనాలకు అందిస్తూ టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది ఈ ఫ్లాట్ ఫారం. ఇక ఈ ఫ్లాట్ ఫారం పై ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఇక ఇటీవలే మగువ ఓ మగువా సీరియల్ స్టార్ట్ అయింది. ఈ సీరియల్ కాన్సెప్ట్ బాగుండడంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సీరియల్ లో తన నటనతో మైమరిపిస్తున్న సింధు రియల్ లైఫ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ముద్దుగుమ్మ అసలు పేరు కృతిక ఉమాశంకర్. ఈమె ఓ కన్నడ యాక్ట్రెస్. అదేవిధంగా తన స్టడీస్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. మొదటిగా ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో రాణించింది. అనంతరం ప్రొఫెషనల్ మోడల్ గా మంచి పేరు ప్రత్యేకలు పొందింది. కానీ ఈ ముద్దుగుమ్మ కి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొట్టమొదటిసారిగా నటిస్తున్న సీరియలే మగువ ఓ మగువ.
అయినప్పటికీ ఏమాత్రం కంగారు పడకుండా తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ఇక ఈ సీరియల్ లో ఈమె నటనకి ఎందరో తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరి రానున్న రోజుల్లో మరిన్ని సీరియల్స్ లో నటించాలని కోరుకుంటున్నారు కూడా. అంతేకాకుండా ఒక్క సీరియల్స్ కే పరిమితం కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా రాణించే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గురించి మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!